Share News

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం కీలక తీర్పు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:39 AM

Supreme Court: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు మరియమ్మ హత్య కేసులో ఉచ్చుబిగుస్తోంది. ఈరోజు సురేష్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక తీర్పు చెప్పింది.

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం కీలక తీర్పు
Nandigam Suresh

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరియమ్మ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ(మంగళవారం) నందిగం సురేష్‌ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డిను మరియమ్మ ధూషించింది. మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను నందిగం సురేష్ అనుచరులు హతమార్చారు.


ఈ విషయంపై అప్పట్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. 2020 నుంచి పోలీసులు విచారణ జరపకపోవడంతో దర్యాప్తు ముందుకు కదల్లేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి నారా లోకేష్‌ను మరియమ్మ కుమారుడు కలిసి తనకు న్యాయం చేయాలని కోరాడు. మరియమ్మ మృతి గురించిన వివరాలను, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును మరియమ్మ కుమారుడు తెలిపాడు. ఈ హత్య కేసులో సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించాడు.


కేసు తీవ్రత నేపథ్యంలో సురేష్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో నందిగం సురేష్ సవాల్‌ చేశాడు. నందిగం సురేష్ బెయిల్ పిటీషన్‌పై ఈరోజు(మంగళవారం) జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సురేష్ తన పాత కేసుల వివరాలను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నిచింది. ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయకపోవడంతో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో చార్జిషీటు కూడా దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటీషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Special Trains: పండుగ రోజుల్లో ఈ ట్రైన్స్‌లో ఖాళీలే ఖాళీలు.. త్వరపడండి..

Railway Zone : ‘రైల్వే జోన్‌ డీపీఆర్‌’

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 07 , 2025 | 11:47 AM