Borugadda Anil Kumar: బోరుగడ్డకు బిగ్‌షాక్.. మరో కేసులో..
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:57 PM
Borugadda Anil Kumar: వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై వీడియోలతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. ఇప్పటికే ఆయన రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉన్నారు.

పల్నాడు జిల్లా: వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు మరో షాక్ తగిలింది. బోరుగడ్డ అనిల్‌ను నరసరావుపేట కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. ఫిరంగిపురం పీఎస్‌లో బోరుగడ్డపై కేసు నమోదైంది. పీటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టుకు పోలీసులు తీసుకుని వచ్చారు. ఈ కేసులో వచ్చే నెల 4వ తేదీ వరకూ బోరుగడ్డ అనిల్‌కు జడ్జి రిమాండ్ విధించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా బోరుగడ్డ అనిల్ ఉన్నారు.
బోరుగడ్డ అనిల్ కుమార్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కోర్టు నిర్దేశించిన గడువులోపు రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు అధికారుల ముందు లొంగిపోకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను ఉద్దేశించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5గంటల్లోగా రాజమండ్రి కేంద్ర కారాగారం అధికారుల ముందు ఎందుకు లొంగిపోలేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు అడిగింది. ఇష్టమైనప్పుడు వచ్చి లొంగిపోతామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. కళ్లు మూసుకుంటే బెయిల్ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారని మండిపడింది. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పణపై కోర్టుధిక్కరణ చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ప్రాథమిక దర్యాప్తు వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్ కుమార్ చేలరేగిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలను అసభ్యంగా ధూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి అనిల్ రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. కాగా బోరుగడ్డపై వరుస కేసులు నమోదవుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News