Share News

Anitha: వారి కదలికలపై నిఘా పెట్టాలి.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 09:22 PM

Home Minister Anitha: చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

Anitha: వారి కదలికలపై నిఘా పెట్టాలి.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
Home Minister Anitha

అమరావతి: నేరాల నియంత్రణలో టెక్నాలజీ కీలకమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో రాజీపడవద్దని పోలీసులకు సూచించారు. ఇవాళ(శుక్రవారం) డీజీపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. సరెండర్లు, ఏరియర్లు ఇప్పించాలని రాష్ట్ర పోలీస్ సంఘం ప్రతినిధులు హోంమంత్రి అనితకు వినతిపత్రం అందజేశారు.


అనకాపల్లిలో హిజ్రా హత్యపై ప్రభుత్వం, పోలీసుల స్పందన పట్ల హిజ్రాలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణ అభినందనీయమని పోలీస్ శాఖను ప్రశంసించారు. కలెక్టర్ల సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహిద్దామని చెప్పారు. నేరం జరగ్గానే నిందితులను పట్టుకోవడం మంచి పరిణామమని అన్నారు. హెల్మెట్ ధరించని వారిపట్ల సున్నితంగా వ్యవహరించాలని హోంమంత్రి సూచించారు. రౌడీయిజం తగ్గించే దిశగా రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని హోంమంత్రి అనిత అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్‌ ఫైర్

Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే

CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 09:24 PM