Minister Nara Lokesh: భోగి పండుగ సరికొత్త కాంతులు తీసుకురావాలి
ABN , Publish Date - Jan 13 , 2025 | 09:49 AM
Minister Nara Lokesh: తెలుగు ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి అన్నారు. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.
అమరావతి: తెలుగు ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి అన్నారు. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని అన్నారు. భోగి వేళ మీ జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు జరగాలని తెలిపారు. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని మంత్రి నారా లోకేష్ కోరుకున్నారు.
భోగి పండుగ భోగ భాగ్యాలు తీసుకురావాలి: దగ్గుబాటి పురంధేశ్వరి
తెలుగు ప్రజలందరికీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ మనందరి జీవితాల్లోకి భోగ భాగ్యాలు తీసుకురావాలని కోరుకున్నారు. సంక్రాంతి పండుగ మనం వేసే రంగు రంగుల ముగ్గుల తరహాలో సంక్రాంతి నాడు మన జీవితాల్లో సంతోష హరివిల్లులు వెల్లివిరియాలని అన్నారు. కనుమ పండుగ మనం కన్న కలలను సాకారం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని చెప్పారు. మనకు, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని సంక్రాంతి పండుగ గుర్తు చేస్తుందని తెలిపారు. సర్వేజనా సుఖినోభవంతు అని దేవుడ్ని ప్రార్థిస్తూ తెలుగు ప్రజలందరికీ దగ్గుబాటి పురంధేశ్వరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
పండుగను ఆనందంగా జరుపుకోవాలి: చింతకాయల అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి జిల్లా: నర్సీపట్నంలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భోగి మంటలు వెలిగించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన కళాకారులతో ముచ్చటించారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని అందరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.
భోగి పండుగ సుఖ సంతోషాలు కలిగించాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా (గుడివాడ): గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో భోగి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. కూటమి నాయకులు, గ్రామస్తులతో కలిసి భోగిమంటలను ఎమ్మెల్యే వెలిగించారు. సకల జనులకు భోగి సుఖ సంతోషాలు కలిగించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సంక్రాంతి.. అందరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలని ఎమ్మెల్యే రాము తెలిపారు.
సంక్రాంతి పండుగ ఆనందమయం కావాలి: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
సంక్రాంతి పండుగ అందరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆకాక్షించారు. పామర్రు ఎన్టీఆర్ సర్కిల్లో ఇవాళ(సోమవారం) భోగి వేడుకల్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా దంపతులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, ప్రజలతో కలిసి కలిసి భోగిమంటలు వెలిగించారు. ఈ సంబరాల్లో భోగి కోలాట నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరి దాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ... సకల జనులకు భోగి పండుగ సుఖ సంతోషాలు కలిగించాలని అన్నారు. ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..
Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు
TTD: కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
Read Latest AP News and Telugu News