CM Chandrababu: చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు ..ఎందుకంటే
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:00 PM
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ఉండవల్లిలోని నివాసంలో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని గాదె శ్రీనివాసులు కోరారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో ఇవాళ (బుధవారం) ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు కలిశారు. గాదె శ్రీనివాసులు నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కూటమి ప్రభుత్వానికి తన మద్దతు గాదె శ్రీనివాసులు నాయుడు ప్రకటించారని చెప్పారు. ప్రభుత్వానికి -ఉపాధ్యాయులకు మధ్య శ్రీనివాసులు నాయుడు వారధిగా పనిచేస్తారని సీఎం చంద్రబాబుకు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి
. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
చంద్రబాబు ఆశీర్వాదం.. నాకు కొండంత ధైర్యం: గాదె శ్రీనివాసులు నాయుడు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. తన గెలుపు కోసం సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలన్నీ సహకరించాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కలిసి పని చేయటం తనకు అలవాటు అని చెప్పారు. చంద్రబాబు ఆశీర్వాదంతో తనకు కొండంత ధైర్యం వచ్చిందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP Council: వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే
Read Latest AP News And Telugu News