Share News

Pawan Kalyan: స్వచ్ఛ దివస్‌లో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jan 18 , 2025 | 02:23 PM

Pawan Kalyan: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. స్వచ్ఛ దివస్‌లో భాగంగా పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిశుభ్రతపై అవగాహన పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Pawan Kalyan: స్వచ్ఛ దివస్‌లో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు
Pawan Kalyan

గుంటూరు జిల్లా : 'స్వచ్ఛంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. నంబూరులో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... పరిశ్రుభ్రత కల్చర్ అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అని పవన్ కల్యాణ్ తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచటం అనేది ఏ ఒక్కరి వల్లో అయ్యేది కాదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారని అన్నారు. వెంటనే అద్భుతాలు ఆశించలేమని.. కానీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు.


'స్వచ్ఛంధ్ర - స్వర్ణాంధ్ర' లో భాగస్వామ్యం కావాలి: మంత్రి కొల్లు రవీంద్ర

kollu-ravindra.jpg

కృష్ణాజిల్లా, (మచిలీపట్నం): 'స్వచ్ఛంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమాన్ని ఇవాళ(శనివారం) కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మంత్రి ప్రారంభించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ బండి రామకృష్ణతో కలిసి మాచవరం బీసీ హాస్టల్ వద్ద మొక్కలు నాటారు. అనంతరం చీపుర్లు చేతబట్టి రోడ్లను ఊడ్చారు. అలాగే పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 02:24 PM