Buddha Venkanna: వీడిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పు లేదు!
ABN , Publish Date - Jan 05 , 2025 | 09:34 PM
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
అమరావతి, జనవరి 05: గతంలో పల్నాడు జిల్లా పర్యటనలో తమపై దాడి చేసిన తురకా కిషోర్ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న .. తన ఎక్స్ ఖాతా వేదికగా ఆదివారం స్పందించారు. తురకా కిషోర్‌ను ఎన్‌కౌంటర్ చేసినా తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆకు రౌడీలు సమాజానికి హానికరమన్నారు. చైర్మన్ పదవి ఆశ చూపించి.. ఈ తురకా కిషోర్‌ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమపైకి వదిలారని గుర్తు చేశారు. ఆ నాడు తాము తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని బుద్దా వెంకన్న చెప్పారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆదేశాలు వచ్చాయని తెలిపారు.
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ తురకా కిశోర్ అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న పర్యటించారు.
ఆ సమయంలో వారిపై తురకా కిషోర్ దాడికి దిగాడు. ఆ క్రమంలో టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న కారు అద్దాలు బద్దలు కొట్టి.. మరి దాడికి దిగాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు మీడియాలో వైరల్ అయినాయి. అయితే ఈ దాడిపై అప్పట్లో కేసు సైతం నమోదు అయింది. అయినప్పటికీ.. అతడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Also Read : ప్రభుత్వంపై స్వామీజీల ధర్మాగ్రహం.. డిక్లరేషన్
Also Read : యుద్ధానికి సిద్ధం కండి: మహ్మద్ యూనస్ పిలుపు
Also Read: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం
Also Read: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
Also Read: ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
Also Read: చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే
Also Read :సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త
ఇక గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోలువు తీరింది. దీంతో నాటి నుంచి తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతడు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా సమాచారంతో పోలీసులు హైదరాబాద్ చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న పై విధంగా స్పంధించారు.
For AndhraPradesh News And Telugu News