-
-
Home » Andhra Pradesh » Today Breaking News and Telangana Assembly Sessions Parlament Sessions and Betting Apps Issue IPL 2025 Live Updates in Telugu News Amar
-

Breaking News: బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ ట్విస్ట్
ABN , First Publish Date - Mar 24 , 2025 | 10:18 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-24T13:27:17+05:30
బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ ట్విస్ట్
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు
19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు
యాప్ నిర్వహకులే లక్ష్యంగా పోలీసుల చర్యలు
సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు.
యాప్ నిర్వాహకులే టార్గెట్‌గా కొత్త సెక్షన్లు
మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి విచారణ
కోర్టులో మెమో దాఖలు చేసిన మియాపూర్ పోలీసులు
యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిని ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే అవకాశం
-
2025-03-24T10:37:52+05:30
అసెంబ్లీకి జగదీష్ రెడ్డి
అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్
తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి
-
2025-03-24T10:37:04+05:30
న్యాయవాదిపై హత్యాయత్నం
ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పై హత్యాయత్నం
కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలింపు
పాత కక్షలతో అడ్వకేట్ పై హత్యాయత్నం
అడ్వకేట్ ఇజ్రాయీల్ చంపాపేట ఈస్ట్ మారుతీ నగర్ నివాసి
హత్యాయత్నం చేసింది ఎలక్ట్రీషియన్ దస్తగిరిగా గుర్తింపు
-
2025-03-24T10:21:12+05:30
అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం
వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందంటూ బిజెపి ఎమ్మెల్యేల నిరసన.
విరిగిన మొక్కజొన్న కంకులు, రాలిపడిన మామిడికాయలను తీసుకొచ్చి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
అసెంబ్లీ లోపలకు ఎలాంటి వస్తువులను తీసుకురావద్దంటూ అడ్డుకున్న మార్షల్స్
మీడియా పాయింట్ వద్ద కూడా ఎలాంటి నిరసన వస్తువులు తీసుకురావద్దని అడ్డుకున్న మార్చల్స్
మీడియా పాయింట్ వద్ద రైతులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న బిజెపి ఎమ్మెల్యేలు
రాష్ట్ర రైతులను ఆదుకునే విధంగా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్
పంట నష్ట అంచనా వేసి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్