Share News

Union Budget For Tax Payers: కొత్త పన్నులతో నెలకు మీకు మిగిలే డబ్బులు ఎంతంటే..

ABN , Publish Date - Feb 01 , 2025 | 02:30 PM

New Income Tax Slabs: కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను శ్లాబ్‌లను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి, వేతన జీవులకు సూపర్ న్యూస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో ప్రతి నెలా ఎంతవరకు మిగులుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం..

Union Budget For Tax Payers: కొత్త పన్నులతో నెలకు మీకు మిగిలే డబ్బులు ఎంతంటే..
Union Budget For Tax Payers

2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈసారి మధ్యతరగతి, వేతన జీవులకు చాలా గుడ్‌న్యూస్‌లు చెప్పింది. అందులో ప్రధానమైంది కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్స్. రూ.12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు నిర్మలమ్మ. రూ.0 నుంచి రూ.4 లక్షలు ఆదాయం ఉంటే రూపాయి కట్టనక్కర్లేదు. రూ.4-రూ.8 లక్షల ఆదాయం మీద 5 శాతం, రూ.8-రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.12-రూ.16 లక్షల ఇన్‌కమ్‌పై 15 శాతం, రూ.16 నుంచి రూ.20 లక్షల ఇన్‌కమ్ మీద 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల ఆదాయంపై 25 శాతం.. రూ.24 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన వారికి 30 శాతం ట్యాక్స్ విధిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రీబేట్ రూపంలో పలు శ్లాబ్‌ల వారికి డబ్బులు రిటర్న్ వస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో నెలకు అసలు మిగిలేది ఎంత అనేది ఇప్పుడు చూద్దాం..


భారీగా రీబేట్!

రూ.8 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఇప్పుడు ఏడాదికి రూ.30 వేలు పన్ను కడుతున్నారు. ఇక మీదట రూ.20 వేలు కడితే చాలు. కొత్త ట్యాక్స్ శ్లాబ్ కింద పది వేలు తగ్గింపు దొరికినట్లే. దీనికి తోడు కట్టిన రూ.20 వేల పన్ను కూడా రీబేట్ కింద ప్రభుత్వం తిరిగి మన అకౌంట్‌లో వేసేస్తుంది. ఆ లెక్కన మొత్తంగా రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. రూ.9 లక్షల ఆదాయం కలిగిన వారు ప్రస్తుతం రూ.40 వేల ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఇకపై వాళ్లు రూ.30 వేలు కడితే చాలు. దీంతో రూ.10 వేల బెనిఫిట్ కలుగుతోంది. దీనికి తోడు రీబేట్ కింద కట్టిన రూ.30 వేలు తిరిగి ఖాతాలో పడతాయి. కాబట్టి మొత్తంగా రూ.40 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది.


ఫుల్ బెనిఫిట్స్!

రూ.10 లక్షల శ్లాబ్‌లో ఉన్నవారు ప్రస్తుతం ఏడాదికి రూ.50 వేల పన్ను కడుతున్నారు. ఇక మీదట రూ.40 వేలు చెల్లిస్తే చాలు. ఈ శ్లాబ్‌లోనూ రూ.10 వేల మినహాయింపు ఇస్తోంది సర్కారు. ట్యాక్స్ కింద కట్టిన రూ.40 వేలు కూడా రీబేట్ కింద రిటర్న్ అవుతాయి. కాబట్టి మొత్తంగా ట్యాక్స్ పేయర్స్‌కు రూ.50 వేలు బెనిఫిట్ అవుతుంది. రూ.11 లక్షల శ్లాబ్ వారు ప్రస్తుతం రూ.65 వేల ట్యాక్స్ కడుతున్నారు. ఇక మీదట రూ.50 వేలు చెల్లిస్తే చాలు. తగ్గిన పన్ను మొత్తం 15 వేలకు తోడు రీబేట్ అయ్యే 50 వేలు కలిపి ఓవరాల్‌గా రూ.65 వేల వరకు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.


వాళ్లకు నో రీబేట్!

రూ.12 లక్షల శ్లాబ్ వారికి ఏడాదికి రూ.80 వేల వరకు బెనిఫిట్ లభిస్తుంది. రూ.16 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు శ్లాబ్‌లో ఉన్నవారికి రీబేట్ కింద అమౌంట్ ఏమీ రాదు. కానీ ఆ శ్లాబ్‌ల పన్నులు తగ్గించడంతో ఏటా వారికీ భారీగా ప్రయోజనం చేకూరనుంది. రూ.16 లక్షల ఆదాయం కలిగిన వారికి రూ.50 వేలు, రూ.20 లక్షల ఆదాయం కలిగిన వారికి రూ.90 వేలు, రూ.24 లక్షల ఆదాయం కలిగిన వారికి రూ.1,10,000 వేలు, రూ.50 లక్షల ఆదాయం కలిగిన వారికి రూ.1,10,000 వేల మేర ప్రయోజనం చేకూరనుంది.


ఇవీ చదవండి:

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

డెలివరీ సంస్థలో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 03:22 PM