Share News

Elon Musk : అతడి మాటలు పట్టించుకోవద్దు.. బయటకు పొమ్మనండి.. ఎలాన్ మస్క్ తండ్రి

ABN , Publish Date - Jan 08 , 2025 | 02:49 PM

ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్‌‌ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

Elon Musk : అతడి మాటలు పట్టించుకోవద్దు.. బయటకు పొమ్మనండి.. ఎలాన్ మస్క్ తండ్రి
Elon Musk, Errol Musk

ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి కీవ్ స్టార్మర్‌పై ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్‌‌ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్‌ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. బిలియనీర్ కాబట్టి అతడు చెప్పే మాటలేవి ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని.. అతడూ ఓ మామూలు మనిషే అని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ గురించి ఇంకా ఏమన్నారంటే..


గత కొన్ని వారాలుగా యూరప్ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించి 'ఎక్స్'లో వరస కామెంట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తన కుమారుడి మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని యూకే ప్రజలకు సూచించారు.. ఎలాన్ తండ్రి ఎర్రల్ మస్క్. "నా ఉద్దేశంలో అతడూ కేవలం సాధారణ వ్యక్తి. అతడి వద్ద డబ్బు ఉంది. బిలీయనీర్ కాబట్టి లక్షలాది మంది అతడి ట్వీట్స్ రీట్వీట్ చేస్తున్నారు లేదా అలాగే మాట్లాడుతున్నారు. నేనైతే అలా చేయను. ఎలాన్ చెప్పేవి పట్టించుకుని చింతించకుండా బయటికి పొమ్మని చెప్పాలంతే" అని సలహా ఇచ్చాడు. చాలా కాలం నుంచి ఎలాన్‌కు, ఆయన తండ్రికి మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి. ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర విడుదల సమయంలో ఆ పుస్తక రచయిత ఐజాక్సన్‌ ఈ విషయాన్ని బయటపెట్టారు.


మస్క్-స్టార్మర్ వివాదం

2008 -2013 వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ (DPP) డైరెక్టర్‌గా ఉన్న సమయంలో.. UK ప్రధాన మంత్రి కీర్‌స్టార్మర్‌ యువతులపై వేధింపులకు పాల్పడే ముఠాలపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యారని ఎలోన్ మస్క్ ఆరోపించారు. స్టార్మర్ మస్క్ గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆ వాదనలను గట్టిగా ఖండించారు. ఇంకా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్ తమ దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాని ట్రూడో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌పైనా ఆరోపణలు చేసి వివాదాలు మూటగట్టుకున్నారు.

Updated Date - Jan 08 , 2025 | 02:49 PM