Share News

USA Illegal Immigrants Video : అక్రమ వలసదారులకు సంకెళ్లు, గొలుసులు.. వైట్‌హౌస్‌ పోస్ట్ చేసిన వీడియో వైరల్..

ABN , Publish Date - Feb 19 , 2025 | 01:56 PM

USA Illegal Immigrants Handcuffs Viral Video : అమెరికాలోకి అక్రమంగా ఎవరూ ప్రవేశించినా వారికి ఇదే గతి పడుతుందని ప్రపంచానికి తెలిసేలా వైట్‌హౌస్‌ ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై భారత్ సహా వివిధ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం అక్రమ వలసదారులను ఉగ్రవాదులు లేదా క్రిమినల్స్ తరహాలో స్వదేశానికి గొలుసులు, సంకెళ్లు వేసి పంపించడం దారుణమని పలువురు మండిపడుతున్నారు.

USA Illegal Immigrants Video : అక్రమ వలసదారులకు సంకెళ్లు, గొలుసులు.. వైట్‌హౌస్‌ పోస్ట్ చేసిన వీడియో వైరల్..
White House Releases Illegal Immigrants Video Viral

USA Illegal Immigrants Handcuffs Viral Video : ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను స్వదేశాలకు తరలించే ప్రక్రియపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వేలమందిని హుటాహుటిన వారి వారి దేశాలకు పంపించింది అగ్రరాజ్యం. డిపోర్టేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే అక్రమ వలసదారుల పట్ల అగ్రరాజ్యం వైఖరి ఎలా ఉంటుందో చాటి చెప్పే ఉద్దేశంతో వైట్‌హౌస్‌ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సంకెళ్లు, గొలుసులతో అక్రమ వలసదారులను కట్టిపడేసి విమానం వద్దకు నడిపిస్తున్న దృశ్యాలు చూసి నెటిజన్లు ట్రంప్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


యూఎస్‌లో అక్రమంగా ప్రవేశిస్తే ఇదే గతి..

అక్రమ వలసదారుల విషయంలో ఇకపై తామెంత కఠినంగా ఉంటామో ప్రపంచానికి చూపించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ఎంత తహతహలాడుతోందో.. వైట్‌హౌస్‌ పోస్ట్ చేసిన 41 సెకన్ల వీడియో చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది. ఇందులో కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేసిన అక్రమ వలసదారులను కొంతమంది అధికారులు విమానం వద్దకు నడిపించుకుంటూ తీసుకెళ్లడం కనిపిస్తుంది. అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టే వారిని హెచ్చరించేందుకు ఈ వీడియో రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది.


Trump: భారత్‌కు డబ్బులు ఎందుకివ్వాలి.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్..


మస్క్ రిప్లైపై నెటిజన్లు ఫైర్..

వైట్‌హౌస్‌ ఎక్స్‌లో పోస్ట్ చేసిన కాసేపటికే ఈ వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక వీడియో రిలీజ్ అయిందే తడవుగా ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ‘వావ్‌’ అని క్యాప్షన్ ఇస్తూ రీపోస్ట్ చేయడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యం వలసదారులను డీపోర్ట్ చేసే విధానం ఏ మాత్రం సరిగా లేదని భారత్ సహా అనేక దేశాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.


రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే అక్రమ వలసదారులను టార్గెట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ మధ్యే కొందరు భారతీయులను మూడు సైనిక విమానాల్లో యూఎస్ నుంచి స్వదేశానికి తిరిగి పంపిన సంగతి తెలిసిందే. డిపోర్టేషన్ ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని గతంలో విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ప్రధాని మోదీ కూడా ఇదే విషయం చెప్పారు. అయినప్పటికీ అమెరికా అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి స్వదేశానికి పంపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ సహా వివిధ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నా భారత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపై ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) ద్వారా ఇలాంటివి జరగకుండా యూఎస్ ప్రభుత్వంతో మాట్లాడతామని జైశంకర్ హామీ ఇచ్చారు.


Read Also : ఆందోళనకరంగా పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు ఏం చెప్పారంటే..

అమెరికాలో శతాధిక వృద్ధులు 2 కోట్ల మంది అట!

Sheikh Hasina : మళ్లీ వస్తా..ప్రతీకారం తీర్చుకుంటా

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2025 | 02:08 PM