Saif Ali Khan Attack Case : సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన.. ఆటో డ్రైవర్‌కు రివార్డు..
ABN , Publish Date - Jan 20 , 2025 | 08:55 PM
సైఫ్‌ను ఆసుపత్రికి తరలించిన డ్రైవర్ భజన్ సింగ్ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛార్జీ కూడా తీసుకోకుండా సమయానికి ఆస్పత్రికి చేర్చేందుకు సహకరించిన ఆటో డ్రైవర్‌కు ఓ సంస్థ రివార్డు అందించింది..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకుంటున్నారు. దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడిన నటుడ్ని ఆసుపత్రికి తరలించిన డ్రైవర్ భజన్ సింగ్ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛార్జీ కూడా తీసుకోకుండా సమయానికి ఆస్పత్రికి చేర్చేందుకు సహకరించిన ఆటో డ్రైవర్‌కు ఓ సంస్థ రివార్డు అందించింది.
సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రానా. కొన్నాళ్లుగా ముంబైలో ఆటో నడుపుతున్న భజన్ ఉత్తరాఖండ్ నివాసి. నటుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. ఆటోడ్రైవర్ సహకారానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ భజన్ సింగ్‌కు శాలువా కప్పి రూ.11 వేల నగదు బహుమతి అందించి సత్కరించింది. ముంబై పోలీసులు డ్రైవర్‌ను విచారణ కోసం పిలిచి ఈ విషయంపై పూర్తి సమాచారం తీసుకున్నారు.
ఒక ఇంటర్వ్యూలో భజన్ సింగ్ రానా ఇలా అన్నాడు. "నేను రాత్రిపూట ఆటో నడుపుతాను. సైఫ్‌పై దాడి జరగగానే ఓ మహిళ బిగ్గరగా అరిచి నా ఆటోను ఆపింది. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ధరించిన తెల్లటి కుర్తా పూర్తిగా రక్తంతో తడిసిన ఉంది. అతడు సైఫ్ అలీఖాన్ అని నేను అనుకోలేదు. సైఫ్‌తో పాటు అతడి ఇద్దరు కుమారులు తైమూర్, జేహ్ కూడా ఆటో ఎక్కారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత సైఫ్ వెంటనే సిబ్బందికి కాల్ చేయండి. నేను సైఫ్ అలీ ఖాన్ అని చెప్పడంతో అతడు ఈ నటుడు సైఫ్ అలీఖాన్ అని అప్పుడే తెలిసిందని భజన్ సింగ్ వెల్లడించాడు. తర్వాత సైఫ్ ఆటో దిగి ఆస్పత్రి లోపలికి వెళ్లారు. వారి నుంచి ఛార్జీలు కూడా తీసుకోలేదు. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని నా అభిప్రాయం".
కాగా, సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ను ముంబై పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. కోటి రూపాయలు తీసుకుని బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడమే నిందితుడి లక్ష్యం. అరెస్టు తర్వాత నిందితుడిని బాంద్రా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. సోమవారం శాంతా క్రజ్ లాకప్ నుంచి బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు, క్రైం బ్రాంచీ టీం అతడిని విచారించనున్నారు.