Google Chrome Users : గూగుల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇది చేయకపోతే హ్యాక్ అవడం పక్కా..!
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:42 PM
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఈ విషయంలో వెంటనే అలర్ట్ అవ్వకపోతే పర్సనల్ డేటాకు హ్యాకర్ల నుంచి ముప్పు తప్పదని తేల్చి చెప్పింది..

CERT Warning To Google Chrome Users : భారతదేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 'కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా-CERT-IN'హై అలెర్ట్ ప్రకటించింది. విండోస్ (Windows),లైనెక్స్ (Linux) లేదా మ్యాక్(Mac)లో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరిస్తోంది. లేకపోతే మీ డివైజ్‌లు హ్యాక్ అయ్యేందుకు 90 శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. పాత క్రోమ్ బ్రౌజర్ లోపాలను అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ కంప్యూటర్‌ను రిమోట్ యాక్సెస్ చేసే ప్రమాదముంది. అంతే కాదు. హ్యాకర్లు కంప్యూటర్ denial-of-service (DoS) కండీషన్‌లోకి వెళ్లేలా చేసి డేటా చోరీ చేసే ప్రమాదముందని వివరించింది. కాబట్టి, సైబర్ అటాక్‌లు జరిగి మీ డేటా చోరీకి గురికాకూడదంటే వెంటనే ఈ పని చేయండి..
గూగుల్ క్రోమ్ విండోస్, మ్యాక్ వెర్షన్ 131.0.6778.204/.205, లైనక్స్ 131.0.6778.204ల కంటే ముందు వెర్షన్లు వినియోగించే యూజర్లు వెంటనే అలర్ట్ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వీటి కంటే ముందు వెర్షన్లలో అనేక లోపాలున్నాయని, వీటి కారణంగా సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసే అవకాశాలెక్కువని సూచిస్తోంది. వెంటనే అప్‌డేట్ చేసుకోకపోతే హ్యాకర్లు మీ కంప్యూటర్లను రిమోట్ యాక్సిస్‌గా మార్చడం, కంప్యూటర్ denial-of-service (DoS)కండీషన్‌లోకి తీసుకెళ్లి డేటా చోరీ చేయడం, మాల్వేర్ ఎక్కించడం లాంటివి చేసే ప్రమాదముంది. ఇలా జరిగితే మీ డేటా సాయంతో హ్యాకర్లు సిస్టమ్ కరప్షన్ వంటి తీవ్ర సమస్యలు సృష్టించే అవకాశముందని 'కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా -CERT-IN' ప్రకటించింది.
సమస్య ఏంటంటే..
CERT-In సూచనల ఆధారంగా గూగుల్ క్రోమ్ వర్షన్స్ అప్‌డేట్ చేయకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. క్రోమ్ బౌజర్ వెర్షన్-8లోని జావా స్క్రిప్ట్ ఇంజిన్‌లో డైనమిక్ వెబ్ కంటెంట్‌ను రన్ చేసినప్పుడు బగ్స్ రావచ్చు. కోడింగ్‌లో ఎర్రర్ వస్తే మీ కంప్యూటర్ హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు ఈజీ అవుతుంది. ఒకసారి ఇలాంటి బగ్స్ మీ డెస్క్‌టాప్‌లో వస్తే డేటా కరప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. హ్యాకర్స్ మీ సిస్టమ్ తమ అధీనంలోకి తెచ్చుకుని మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. కీలకమైన డేటా యాక్సెస్ చేసే అవకాశం సైబర్ నేరగాళ్లకు చిక్కితే బ్రౌజర్ మొత్తం క్రాష్ అయిపోతుంది.
మీరు సురక్షితంగా ఉన్నారా?
భారత్‌లో చాలా మంది యూజర్లు ప్రతి విషయానికి గూగుల్ క్రోమ్‌ను డిఫాల్ట్‌గా బ్రౌజర్‌గా ఉపయోగిస్తారు. మీ సెర్చ్ హిస్టరీ మొత్తం ఇందులో సేవ్ అయ్యుంటుంది. మెయిల్స్, ఫోటోస్, అన్నింటికీ గూగుల్ ఫీచర్స్‌తోనే లింక్ చేస్తారు. పొరపాటున మీరు బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మీ వృత్తిగత, వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముంది. కాబట్టి, వెంటనే అలర్ట్ అయ్యి మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకున్నారో? లేదో? చెక్ చేసుకోండి.
ఇలా చేస్తే ఏ సమస్యా రాదు..
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ చేయడం చాలా సులభం. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఐకాన్ ఓపెన్ చేసి కుడి వైపున ఉన్న సెట్టింగ్స్‌పై క్లిక్ చేస్తే Help ఆప్షన్ సెలక్ట్ చేయండి. తర్వాత About Google Chrome ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు క్రోమ్ కొత్త అప్‌డేట్స్ కోసం సెర్చ్ చేసి ఆటోమెటిక్‌గా అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేస్తుంది. అప్‌డేట్ పూర్తయ్యాక రీలాంచ్ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే అప్‌డేషన్ పూర్తవుతుంది. యూజర్‌లు బ్రౌజర్‌లో ఆటోమెటిక్ అప్‌డేట్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకుంటే ఎలాంటి సమస్యా రాదని నిపుణులు సూచిస్తున్నారు.