Nita Ambani : ప్రధాని మోదీ, భర్త అంబానీపై ప్రశ్న.. నీతా మాస్ రిప్లైకి వీక్షకుల హ్యాట్సాఫ్!
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:53 PM
Nita Ambani Harward : హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన ర్యాపిడ్ ఫైర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఏ మాత్రం తడుముకోకుండా చమత్కారం జోడించి ఆమె ఇచ్చిన సమాధానం విని సమావేశానికి హాజరైన వీక్షకులు వారెవ్వా అంటూ హ్యాట్సాఫ్ చెప్పారు. ఇంతకీ ఆమె ఏమని సమాధానం చెప్పారంటే..

Nita Ambani Harward : రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఈనెల 15, 16 తేదీల్లో జరిగిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉపన్యాసం ఇచ్చిన ఆమె, ఒక రాపిడ్-ఫైర్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతాకు తన భర్త ముఖేష్ అంబానీ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో ఎవరు గొప్ప అనే ప్రశ్న ఎదురైంది. ఒకరినే ఎంచుకోవాలని హాస్యాస్పదంగా అడగడంతో.. అందుకు బదులుగా చమత్కారంగా స్పందించి కాన్ఫరెన్స్‌కు హాజరైన వారి ముఖాల్లో నవ్వులు పూయించారు.
హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన రాపిడ్-ఫైర్ రౌండ్ సందర్భంగా, నీతా అంబానీ అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భారత ప్రధాని మోదీ, ఆమె భర్త ముఖేష్ అంబానీలలో మీకు ఎవరు గొప్ప అని అడగ్గా దానికామె ఇలా స్పందించారు. "ప్రధాని మోదీ దేశానికి మంచి చేసేవారైతే.. నా భర్త ముఖేష్ మా ఇంటికి మంచి చేసేవారని" అని చెప్పడంతో ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు, నవ్వులు వెల్లువెత్తాయి. చాలా తెలివిగా బదులిచ్చారంటూ ప్రశంసలు కురిపించారు.
నీతా అంబానీ ర్యాపిడ్ ఫైర్ సంభాషణ క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు నీతా అంబానీ సమయస్ఫూర్తికి, తెలివితేటలకు ఫిదా అవుతున్నారు. హార్వర్డ్‌లో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్‌లో నీతా అంబానీ భారత సంస్కృతి, వాణిజ్యం, విధానాలు, కళలు తదితర అంశాలపై కీలక ఉపన్యాసం చేశారు. ఇదిలా ఉంటే రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా విస్తృతంగా దాతృత్వ కార్యక్రమాలకు అమెరికాలో సముచిత గౌరవం లభించింది. మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ నీతా అంబానీకి గౌరవనీయమైన గవర్నర్ సైటేషన్‌ను ప్రదానం చేశారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా మసాచుసెట్స్ ప్రభుత్వం ఈ ప్రశంసా పత్రం అందించింది.
ఇవి కూడా చదవండి..
Delhi New CM: వాయిదా పడిన ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై వీడని ఉత్కంఠ..
USAID: యూఎస్ఏఐడీ అతిపెద్ద స్కామ్.. ప్రధాన మంత్రి సలహాదారు కామెంట్
New Delhi : అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చెయ్యాల్సిందే!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..