Share News

Delhi Elections: 'ఆప్‌'కు మమత మద్దతు.. కృతజ్ఞతలు చెప్పిన కేజ్రీ

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:52 PM

గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.

Delhi Elections: 'ఆప్‌'కు మమత మద్దతు.. కృతజ్ఞతలు చెప్పిన కేజ్రీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మమతా బెనర్జీ (Mamata Banerjee) సారథ్యంలోని టీఎంసీ (TMC) మద్దతు తెలిపింది. ఇప్పటికే ఆప్‌కు మద్దతిస్తు్న్నట్టు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ మద్దతు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మమతాబెనర్జీకి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.

Delhi Elections: మేము విపక్షమైతే బీజేపీ మీ దోస్తా?.. గెహ్లాట్‌ను నిలదీసిన కేజ్రీ


''ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతిస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది. మమతా దీదీకి వ్యక్తిగతంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్యూ దీదీ.. మేము బాగున్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడూ కూడా మీరు మా వెన్నంటే ఉండి ఆశీర్వదిస్తున్నారు'' అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌కు టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వెంటనే 'ఎక్స్'లో స్పందించారు. మేము మీకు బాసటగా ఉంటామంటూ ఆ ట్వీట్‌లో ఒబ్రెయిన్ హామీ ఇచ్చారు.


గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Supreme Court: సమాచార కమిషన్‌ పదవులను తక్షణమే భర్తీ చేయండి

ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్‌ పోల్‌’

Read Latest National News and Telugu News

Updated Date - Jan 08 , 2025 | 05:56 PM