Share News

Snakes Viral: గుట్టలుగా బయటపడ్డ గుడ్లు.. అన్నింటినీ పొదిగించి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:04 PM

ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గుట్టలుగా గుడ్లు బయటపడడం చూసి ప్రజలు షాక్ అయ్యారు. చివరకు వాటిని పొదిగించి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Snakes Viral: గుట్టలుగా బయటపడ్డ గుడ్లు.. అన్నింటినీ పొదిగించి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..

సోషల్ మీడియాలో వింతలు, విశేషాలకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతుంటాయి. జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గుట్టలుగా గుడ్లు బయటపడడం చూసి ప్రజలు షాక్ అయ్యారు. చివరకు వాటిని పొదిగించి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఏపీ ప్రకాశం జిల్లా (AP, Prakasam district, Markapuram) మార్కాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణ శివారులోని నిర్జన ప్రదేశంలో సమారు 120 గుడ్లు బయటపడడంతో స్థానికులు షాక్ అయ్యారు. చివరకు పరిశీలించగా రెండు పాములు కలిసి ఈ గుడ్లను (Snake eggs) పెట్టినట్లు తెలిసింది. దీంతో స్నేక్‌క్యాచర్‌కు సమాచారం అందించారు.

Monkey Funny Video: నాక్కావాల్సింది ఇచ్చుకో.. నీక్కావాల్సింది తీసుకో.. కోతి అతి తెలివి చూస్తే నోరెళ్లబెడతారు..


అక్కడికి చేరుకున్న అతను వాటిని స్థానిక అటవీ శాఖ కార్యాయానికి తరలించాడు. ఓ గదిలో ఆ గుడ్లు వేర్వేరుగా చేసి రెండు డబ్బాల్లో ఇసుకలో కప్పి పొదిగించాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ గుడ్లలో సుమారు 80 గుడ్ల నుంచి పాము పిల్లలు బయటికి వచ్చాయి. వీటిని స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు.

Viral Video: పైప్‌లైన్ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని కట్ చేసి చూడగా.. గుండెల్ని పిండేసే సీన్..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. 80 పాములు బయటికి రావడం ఆశ్చర్యంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘స్నేక్ క్యాచర్ చాలా మంచి పని చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Jugadh: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. నీళ్ల క్యాన్‌ను ఎలా సెట్ చేశారో చూడండి..

Updated Date - Mar 22 , 2025 | 05:04 PM