Lions Viral Video: బైకర్‌కు ఎదురెళ్లిన సింహాలు.. చివరకు ఎవరూ ఊహించని షాక్..
ABN , Publish Date - Mar 17 , 2025 | 08:26 AM
రెండు సింహాలు ఇటీవల అటవీ ప్రాంతం నుంచి స్థానిక ప్రాంతానికి చేరుకున్నాయి. సింహాలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సింహాలను చూసిన వాహనదారులు వాటిని చూసి భయంతో పారిపోయారు. అయితే చివరకు రోడ్డుపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది..

అడవిలో జంతువులను హడలెత్తించే సింహాలు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు జంతువులు, మనుషులపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవి నుంచి జనావాసాల్లోకి చొరబడ్డ సింహం.. నేరుగా రోడ్డు పైకి వచ్చేసింది. బైకర్‌కు ఎదురుగా వెళ్లడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లోని (Gujarat) గిర్ ఫారెస్ట్‌లో చోటు చేసుకుంది. రెండు సింహాలు ఇటీవల అటవీ ప్రాంతం నుంచి స్థానిక ప్రాంతానికి చేరుకున్నాయి. సింహాలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరిపై దాడి చేయని సింహాలు.. సైలెంట్‌గా రోడ్డుపైకి చేరుకున్నాయి.
Tricks Viral Video: హెల్మెట్ లాక్ మర్చిపోయారా.. ఇతను చేసింది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
సింహాలను చూసిన వాహనదారులు వాటిని చూసి భయంతో పారిపోయారు. ఇంతలో ఓ బైకర్ వాహనాన్ని రోడ్డుపై ఆపుకొన్నాడు. సింహాలు మెల్లిగా రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాయి. బైకర్‌ను చూసినా (lions walking in front of bike) కూడా కామ్‌గా నడుస్తూ వెళ్తున్నాయి. సింహాలు తన వైపు రావడాన్ని చూసిన బైకర్.. భయంతో బండి వదిలేసి రోడ్డు పక్కకు పారిపోయాడు. అప్పటికీ సింహాలు అతన్ని ఏమీ చేయకుండా తమ దారిన తాము నడుస్తూ వెళ్తున్నాయి.
Monkey Viral Video: కాళ్లు తడవకుండా కాలువ దాటేదెలా.. ఈ కోతి చేసిన పని చూస్తే..
అక్కడే దూరంగా ఉన్న మిగతా వాహనదారులు ఈ ఘటనను తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైక్ వదిలేసి పారిపోవడం కంటే.. వెనక్కు తిప్పుకోని బండిపైనే వెళ్లిపోవచ్చుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ సింహాలు ప్రస్తుతం ఉపవాసంలో ఉన్నట్లున్నాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 24 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
షార్ట్ వీడియోను ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..