Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
ABN , Publish Date - Mar 17 , 2025 | 08:16 AM
వంట పాత్రలు శుభ్రం చేసే సమయంలో సబ్బు వృథా అవడం సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య. అయితే ఓ మహిళ ఈ సమస్యకు వింత పరిష్కారం చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఇంటి పనులు చేసే సమయంలో కొందరు మహిళలు తెలివిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు మహిళలు వివి రకాల ట్రిక్‌లతో కష్టంగా చేయాల్సిన పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఓకేసారి ఐదు, ఆర చపాతీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన మహిళను చూశాం.. అలాగే పాలు పొంగిపోకుండా లోపల చిన్న గిన్నెను పెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసిన మరో మహిళను కూడా చూశాం. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ట్రిక్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ డిష్‌వాష్ సబ్బు వృథా కాకుండా వింత ట్రిక్ ప్రయోగించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈమె ట్రిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వంట పాత్రలు శుభ్రం చేసే సమయంలో సబ్బు వృథా (Waste of soap) అవడం సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య. అయితే ఓ మహిళ ఈ సమస్యకు (Solution to the problem) వింత పరిష్కారం చూపించింది.
Tricks Viral Video: హెల్మెట్ లాక్ మర్చిపోయారా.. ఇతను చేసింది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఇందుకోసం ఆమె సబ్బు పెట్టే ప్లాస్టిక్ బాక్స్‌కు ఎలాస్టిక్ రబ్బర్లను వేసేస్తుంది. ఇలా బాక్స్ చుట్టూ నాలుగు రబ్బర్లను వేస్తుంది. ఆ తర్వాత వాటిపై సబ్బును పెడుతుంది. తద్వారా సబ్బు వృథా కాకుండా ఉంటుందనేది ఆమె ఉద్దేశం. అంతా ఎదుర్కొనే ఈ సమస్యకు ఈమె చూపించిన సులభ పరిష్కారం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: మరణం ఎదురవడమంటే ఇదేనేమో.. వీడియో చూస్తే గూజ్‌బమ్స్ ఖాయం..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ట్రిక్ ఏదో బాగుందిగా’’.. అంటూ కొందరు, ‘‘బాక్స్‌లో సబ్బు మిగిలిపోతే సమస్య ఏముదీ.. ఎలాగూ దాన్ని వాడేస్తాం కదా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 90 వేలకు పైగా లైక్‌లు, 21 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Monkey Viral Video: కాళ్లు తడవకుండా కాలువ దాటేదెలా.. ఈ కోతి చేసిన పని చూస్తే..
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..