Funny Viral Video: సెల్ఫీ స్టిక్ పట్టుకున్న సింహం.. షాకైన మిగతా సింహాలు సమీపానికి వెళ్లగా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:20 PM
ఓ వ్యక్తి సింహాల్లా కనిపించే దుస్తులు ధరించాడు. దూరం నుంచి చూస్తే అచ్చం సింహంలా కనిపించేలా డిజైన్ చేసుకుని, చేతిలో సెల్ఫీ స్టిక్‌తో కెమెరాను పట్టుకుని వాటి వద్దకు వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

అడవికి రాజు ఎవరు అని అంటే సింహం అని టక్కున సమాధానం చెబుతాం. సింహాలను బోనులో చూస్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది. ఇక పొరపాటున ఎదురుగా వచ్చిందంటే.. ప్రాణం పోయినంత పనవుతుంటుంది. అయితే కొందరు మాత్రం సింహాల సమీపానికి వెళ్తుంటారు. మరికొందరు వాటికి ఆహారం కూడా పెడుతూ పెంపుడు జంతువుల్లా చూసుకుంటుంటారు. ఇంకొందరైతే వాటితో ఫన్నీ గేమ్స్ ఆడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సింహాలను చీట్ చేయడానికి పర్యత్నించాడు. అచ్చం సింహంలా కనిపించే డ్రస్ వేసుకుని, వాటి వద్దకే వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సింహాల్లా కనిపించే దుస్తులు ధరించాడు. సింహం నోరు తెరచి ఉండేలా తలను తగిలించుకున్నాడు. దూరం నుంచి చూస్తే అచ్చం సింహంలా (man dressed lion costume) కనిపించేలా డిజైన్ చేసుకుని, చేతిలో సెల్ఫీ స్టిక్‌తో కెమెరాను పట్టుకుని వాటి వద్దకు వెళ్లాడు. విచిత్రంగా కనిపించిన ఈ సింహాన్ని చూసి ఆ రెండు సింహాలు షాక్ అయ్యాయి.
తర్వాత దగ్గరికి వచ్చి తేరిపారా చూశాయి. వాటిలో ఓ సింహం అతడి మీదకు పంజా విసిరింది. అయినా అతను వాటి నుంచి దూరం జరుగుతూ సెల్ఫీ స్టిక్‌తో వీడియో తీయాలని చూశాడు. ఇలా చాలా సేపు ఆ రెండు సింహాలు సింహం తోలు కప్పుకున్న అతడిని విచిత్రంగా గమనిస్తూ, చివరకు వెంబడించాయి. దెబ్బకు అతను పరుగెత్తుకుంటూ వెళ్లి చెట్టు ఎక్కేశాడు. అయినా ఆ సింహాలు వదలకుండా చెట్టు వద్దకూ వెళ్లి పైకి ఎక్కే ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులు జీబ్రా వేషం ధరించి.. జీబ్రాల మంద వద్దకు వెళ్లాడు. వింతగా కనిపించిన ఈ జీబ్రాను చూసి మిగతా జీబ్రాలన్నీ భయంతో పారిపోయాయి.
Viral Video: పైప్‌లైన్ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని కట్ చేసి చూడగా.. గుండెల్ని పిండేసే సీన్..
ఇంతలో రెండు సింహాలు ఈ జీబ్రాను వెంటపడ్డాయి. వాటిలో ఓ సింహం వెనుక పంజా విసిరి డ్రెస్‌ను లాగేయగా.. మరో సింహం తల బొమ్మను లాక్కుని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలనే ఫూల్స్ చేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.68 లక్షలకు పైగా లైక్‌లు, 188.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Jugadh: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. నీళ్ల క్యాన్‌ను ఎలా సెట్ చేశారో చూడండి..
ఇవి కూడా చదవండి..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

12 ఏళ్లకే ఇంట్లో న్యూ క్లియర్ రియాక్టర్ నిర్మాణం..

వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ చిన్న చిట్కాలు ..

విమానాల్లో ఇచ్చే ఫుడ్స్ రుచిలో తేడా! కారణం ఇదే

మీది నిజంగా డేగ చూపా.. ఈ ఫొటోలో పిల్లిని పట్టుకోండి
