Share News

Small House Video: ఇంటిని ఇలాక్కూడా కట్టొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ ఇంజినీర్ తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:13 PM

పెద్ద పెద్ద ఇళ్ల పక్కన మూడు అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఓ వ్యక్తికి ఆ స్థలం చూడగానే విచిత్రమైన ఆలోచన వచ్చింది. మూడు అడుగుల స్థలాన్ని అలా ఖాళీగా వదిలేసే బదులు, అందులో కూడా ఇంటిని నిర్మిస్తే ఎలా ఉంటుందీ.. అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా..

Small House Video: ఇంటిని ఇలాక్కూడా కట్టొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ ఇంజినీర్ తెలివి మామూలుగా లేదుగా..

పట్టణాలు, నగరాల్లో ఇళ్ల స్థలాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో కాస్త ఖాళీ స్థలం ఉంటే చాలు.. ఇట్టే నిర్మాణాలను చేపడుతుంటారు. రాత్రికి రాత్రే ఇళ్లను నిర్మించేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు విచిత్ర ఆకారాల్లో ఇళ్లను నిర్మిస్తుంటారు. మరికొందరు రోడ్ల మీద ఇంటిని కట్టేస్తుంటారు. ఇంకొందరు తమ ఇళ్లను త్రిభుజాకారంలో నిర్మించడం కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి నిర్మించిన ఇంటిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇంటిని ఇలాక్కూడా కట్టొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెద్ద పెద్ద ఇళ్ల పక్కన మూడు అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఓ వ్యక్తికి ఆ స్థలం చూడగానే విచిత్రమైన ఆలోచన వచ్చింది. మూడు అడుగుల స్థలాన్ని అలా ఖాళీగా వదిలేసే బదులు, అందులో కూడా ఇంటిని నిర్మిస్తే ఎలా ఉంటుందీ.. అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా.. రంగంలోకి దిగుతాడు.

Viral Video: పెళ్లిలో గన్లు పట్టుకుని ఫోజులు ఇచ్చిన వధూవరులు.. మధ్యలో వధువుకు ఊహించని షాక్.. చివరకు..


చివరకు మూడు అడుగుల స్థలంలోనే రెండు అందస్తుల (two storied house on three feet space) ఇంటిని నిర్మించేశాడు. కింద షట్టర్ ఏర్పాటు చేసి దుకాణం నిర్మించగా.. దానిపై రెండస్తులను నిర్మించాడు. ఈ ఇల్లు చూసేందుకూ ఎంతో అందగా డిజైన్ చేశారు. అదేవిధంగా మిగతా ఇళ్లకు ఏమాత్రం తగ్గకుండా అందులో అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాడు.

Viral Video: స్కూటీపై వెళ్తూ అదుపు తప్పి లారీ కిందపడ్డాడు.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..


ఇప్పుడు ఈ చిన్న ఇల్లే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దారిన వెళ్లే వారంతా ఈ బుల్లి ఇంటిని చూసి ఆసక్తిగా గమనిస్తున్నారు. కొందరు ఈ ఇంటిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘మూడు అడుగుల్లోనూ ఇంటిని కట్టొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 9.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీళ్లలో ఉన్నాననే ధైర్యంతో ఏనుగు పైనే దాడి చేసింది.. చివరకు మొసలి పరిస్థితి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 07 , 2025 | 04:13 PM