Viral Video: 13వ అంతస్తు నుంచి దూకేసిన వ్యక్తి.. వలలో నుంచి బయటికి వచ్చి మరీ.. చివరకు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 09:21 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని విక్రోలి పరిధి కన్నమ్వార్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 13 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. చివరి అంతస్తులో కొందరు కార్మికులు పని చేస్తుండగా ఉన్నట్టుండి ఊహిచంని ఘటన చోటు చేసుకుంది..

చాలా మంది వివిధ కారణాలతో చివరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తే.. మరికొందరు ఏకంగా ఎత్తైన భవనాల పైనుంచి దూకేసి అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఈ తరహా షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి 13వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. మధ్యలో వలలో నుంచి దూరిమరీ కిందకు పడిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Mumbai) విక్రోలి పరిధి కన్నమ్వార్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 13 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. చివరి అంతస్తులో కొందరు కార్మికులు పని చేస్తుండగా ఉన్నట్టుండి ఊహిచంని ఘటన చోటు చేసుకుంది. బిర్జు ప్రసాద్ అనే కార్మికుడు ఉన్నట్టుండి 13 అంతస్తు నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో భవనం అంచున్న కట్టి ఉన్న వలను పట్టుకుని వేలాడాడు. ఇతను చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అతడి దగ్గరికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో దూరం నుంచి కేకలు వేస్తూ.. అతడిని పైకి రమ్మని పిలిచారు. అయినా ఆ వ్యక్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా వేలాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో చివరకు ఒక్కసారిగా (man jumped from the 13th floor) కిందకు పడిపోయాడు. అయితే మొదటి అంతస్తు చివర్లో పెద్ద వల కట్టి ఉండడంతో దానిపై పడ్డాడు. దీంతో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు యువకుడు కొన్ని నెలలుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు విచారణలో తెలిసింది.
Viral Video: కొంపముంచిన స్నేహితుడు.. వధువు ముందే వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో.. చివరకు..
ఈ క్రమంలో ఒత్తిడి ఎక్కువై ఇలా చేసినట్లు తెలుస్తోంది. పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వల కట్టి ఉండడంతో ప్రాణాలు దక్కాయి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారికి వెంటనే వైద్య చికిత్స అందించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..