Share News

Tricks Viral Video: హెల్మెట్ లాక్ మర్చిపోయారా.. ఇతను చేసింది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:43 PM

ఓ వ్యక్తి తన బైకును రోడ్డు పక్కన పార్క్ చేశాడు. తర్వాత తన హెల్మెట్‌‌ను కూడా బండికి లాక్ చేయాలని అనుకున్నాడు. అయితే లాక్ తీసుకురావడం మర్చిపోవడంతో సమస్యగా మారింది. అయితే చివరకు తన బుర్రకు పని చెబుతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Tricks Viral Video: హెల్మెట్ లాక్ మర్చిపోయారా.. ఇతను చేసింది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

బైకు నడుపుతున్న వారంతా హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది హెల్మెట్‌ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. మరికొందరు వాటిని ధరించినా బైక్‌కు లాక్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. లాక్ ఉంటే ఓకేగానీ.. లేని సమయంలో వాటిని భద్రంగా ఉంచడం పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ఈ సమస్యకు ఓ వ్యక్తి సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకును రోడ్డు పక్కన పార్క్ చేశాడు. తర్వాత తన హెల్మెట్‌‌ను (Helmet) కూడా బండికి లాక్ చేయాలని అనుకున్నాడు. అయితే లాక్ తీసుకురావడం మర్చిపోవడంతో సమస్యగా మారింది. అయితే చివరకు తన బుర్రకు పని చెబుతాడు.

Viral Video: మరణం ఎదురవడమంటే ఇదేనేమో.. వీడియో చూస్తే గూజ్‌బమ్స్ ఖాయం..


హెల్మెట్‌ను బైకు హ్యాండిల్‌కు (Bike handle) తగిలిస్తాడు. ఈ క్రమంలో క్లచ్ హ్యాండిల్‌ను ఒత్తి పట్టుకుని హెల్మెట్‌ను లోపలికి నెట్టేస్తాడు. ఆ తర్వాత బండిని లాక్ చేస్తాడు. దీంతో హెల్మెట్ తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా తాళం చెవి ఉండాలి. లేదంటే హ్యాండిల్‌తో పాటూ హెల్మెట్ కూడా లాక్ అయి ఉంటుందన్నమాట. ఇలా ప్రత్యేకంగా లాక్ లేకపోయినా కూడా తెలివిగా ఆలోచించి హెల్మెట్‌ను లాక్ చేస్తాడు.

Monkey Viral Video: కాళ్లు తడవకుండా కాలువ దాటేదెలా.. ఈ కోతి చేసిన పని చూస్తే..


ఈ వ్యక్తి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి తెలివితేటలు ఇండియా దాటి వెళ్లకూడదు’’.. అంటూ కొందరు, ‘‘చాలా పెద్ద సమస్యను ఎంతో సింపుల్‌గా పరిష్కరించారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 40.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Komodo dragon Viral Video: గేదెపై కొమొడో డ్రాగన్ దాడి.. సమీపానికి వెళ్లగా షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2025 | 01:43 PM