Share News

Jugaad Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో దుస్తుల వాషింగ్.. ఇతడి ట్రిక్ చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 22 , 2025 | 07:01 PM

వినూత్న ప్రయోగాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ప్లాస్టిక్ డ్రమ్ముతో బట్టలు వాష్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Jugaad Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో దుస్తుల వాషింగ్.. ఇతడి ట్రిక్ చూస్తే షాకవ్వాల్సిందే..

పనికిరావనుకుని పక్కన పడేసే వస్తువులతో కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఖాళీ వాటర్ బాటిళ్లతో దుమ్ము క్లీన్ చేసే చీపురులా తయారు చేయడం, పక్కన పడేసిన పేస్ట్ డబ్బాలను కుళాయి మూతలుగా ఏర్పాటు చేయడం, సైకిల్ టైర్ల సాయంతో దుస్తులను వాష్ చేయడం తదితర విచిత్ర ప్రయోగాలను చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ప్లాస్టిక్ డ్రమ్ముతో బట్టలు వాష్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత ప్లాస్టిక్ డ్రమ్మును (Plastic drum) వాషింగ్ మెషిన్‌లా (Washing machine) మార్చాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం ప్లాస్టిక్ డ్రమ్ముతో పాటూ ఓ పాత మోటారును కూడా తీసుకున్నాడు. తర్వాత డ్రమ్మును ఓ ఇనుప స్టాండ్‌పై పెట్టి, దాని కింద రంధ్రం చేసి వీల్ సెట్ చేశాడు.

Funny Viral Video: సెల్ఫీ స్టిక్‌ పట్టుకున్న సింహం.. షాకైన మిగతా సింహాలు సమీపానికి వెళ్లగా..


వీల్‌కు మోటారును కనెక్ట్ చేశాడు. ఇలా మొత్తం సెట్ చేశాక.. డ్రమ్ములో పాత దుస్తులను వేసి, మోటారును (motor) ఆన్ చేశాడు. మోటారు తిరగడంతో డ్రమ్ములోని వీల్ కూడా గిర్రున తిరుగుతూ.. దుస్తులను తిప్పుతోంది. ఇలా పాత ప్లాస్టిక్ డ్రమ్ము, మోటారు సాయంతో దుస్తులు ఉతికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

Snakes Viral: గుట్టలుగా బయటపడ్డ గుడ్లు.. అన్నింటినీ పొదిగించి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ప్లాస్టిక్ డ్రమ్ముతో ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.38 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వీధి సందులో నిలబడ్డ యువతి.. సమీపానికి వచ్చిన అంకుల్.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2025 | 07:09 PM

News Hub