Viral Video: యువతిపై పగబట్టిన కోతి.. కాపాడాలని అంతా ఎంత ప్రయత్నిస్తున్నా..
ABN , Publish Date - Jan 11 , 2025 | 08:48 PM
కోతులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని ఇళ్లల్లోకి దూరి వస్తువులు ఎత్తుకుపోతే.. మరికొన్ని మనుషులు బెదిరించి మరీ ఆహార పదార్థాలను లాక్కెళ్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కోతులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని ఇళ్లల్లోకి దూరి వస్తువులు ఎత్తుకుపోతే.. మరికొన్ని మనుషులు బెదిరించి మరీ ఆహార పదార్థాలను లాక్కెళ్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, విచిత్రంగా ప్రవర్తించిన కోతి వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన కోతి హల్‌చల్ చేసింది. చివరకు యువతిని టార్గెట్ చేసి దాడి చేసింది. అంతా కాపాడాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ కోతి సడన్‌గా (monkey entered shopping mall) షాపింగ్ మాల్‌లోకి దూరింది. ఊహించని విధంగా కోతి షాపింగ్ మాల్‌లోకి రావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. కొందరు దానికి అరటిపండ్లు ఇచ్చి ఎలాగోలా బయటికి పంచించే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలో ఆ కోతి అక్కడే ఉన్న ఓ యువతి వద్దకు వెళ్లి భుజాలపై కూర్చుంది.
Viral Video: దాడి చేయబోయిన కొమొడో డ్రాగన్‌కు షాక్.. ఈ మేక ఎలా ఇరికించిందో చూస్తే..
కోతి పైకి ఎక్కడంతో ఆమె భయపడిపోయి ముఖంపై చేతులు అడ్డుపెట్టుకుని కూర్చుండిపోయింది. పక్కన ఉన్న వారు ఎంత అదిలించినా కోతి మాత్రం యువతిని వదల్లేదు. అందటితో (monkey tried to attack young woman) ఆగకుండా ఆమె వెంట్రుకలు పట్టుకుని లాగింది. దీంతో అక్కడే ఉన్న వారు కోతిని దూరంగా తరిమికొట్టేందుకు దానిపై దుప్పట్లు విసిరారు. అయినా కోతి అక్కడి నుంచి వెళ్లకుండా యువతికి చెప్పులను లాగి మరీ కొరికేసింది. ఆ తర్వాత అంతా చుట్టు ముట్టి దప్పుట్లు విసిరేస్తూ కాస్త దూరంగా తరిమికొట్టారు.
Viral Video: ఇంట్లో పెద్ద వాళ్లు ఉండాలనేది ఇందుకే.. ఈ చిన్నారిని తాత ఎలా కాపాడాడో చూడండి..
అయినా కోతి వారి నుంచి తప్పించుకుంటూ చాలా సేపు అక్కడే చక్కర్లు కొట్టింది. చివరకు ఎలాగోలా కోతిని బయటికి పంపించేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంటీ ఈ కోతి మరీ విచిత్రంగా ప్రవర్తిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘షాపింగ్ చేయడానికి వచ్చిందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..