Viral Video: దాడి చేయబోయిన కొమొడో డ్రాగన్‌కు షాక్.. ఈ మేక ఎలా ఇరికించిందో చూస్తే..
ABN , Publish Date - Jan 11 , 2025 | 07:57 PM
కొమొడో డ్రాగన్ వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేయగలదు. పందులు, జింకలు తదితర జంతువులను వేటాడి.. ఆశ్చర్యకరంగా ఎంతో వేగంగా మింగేయడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి ..
కొమొడో డ్రాగన్ వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేయగలదు. పందులు, జింకలు తదితర జంతువులను వేటాడి.. ఆశ్చర్యకరంగా ఎంతో వేగంగా మింగేయడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాడి చేయబోయిన కొమొడో డ్రాగన్‌కు ఓ మేక పెద్ద షాక్ ఇచ్చింది. చివరికి ఎలా ఇరికించిందో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కొమొడో డ్రాగన్.. వేట కోసం ఎదురు చూస్తుండగా.. దానికి ఓ మేక కనిపిస్తుంది. దీంతో వెంటనే (komodo dragon tried to attack goat) దాన్ని టార్గెట్ చేస్తుంది. అయితే దాని వద్దకు వెళ్లగానే ముందుగా వేటాడకుండా కాసేపు తమాషా చేస్తుంది. తన తోకతో మేకను కొడుతూ కాసేపు ఆడుకుంటుంది. కొమొడో బుద్ధిని గమనించిన మేక వెంటనే అప్రమత్తమవుతుంది.
Viral Video: ఇంట్లో పెద్ద వాళ్లు ఉండాలనేది ఇందుకే.. ఈ చిన్నారిని తాత ఎలా కాపాడాడో చూడండి..
కొమొడోకు దొరక్కుండా దూరంగా పారిపోతుంది. నోటి దాకా వచ్చిన ఆహారం కాస్తా జారిపోవడంతో షాకైన కొమొడో డ్రాగన్.. వేగంగా ( Komodo dragon chasing goat) పరుగెడుతూ దాన్ని వెంటపడుతుంది. కొమొడోకు దొరక్కుండా అత్యంత వేగంగా పరుగెత్తిన మేక.. అక్కడే ఉన్న కంచెను ఎగిరి పారిపోతుంది. దాని వెంటే వెళ్లిన కొమొడో డ్రాగన్ ఆ కంచె మధ్యలో ఇరుక్కుని ఆగిపోతుంది. దీంతో మేక ప్రాణాలతో బయటపడి తన సహచరుల వద్దకు చేరుకుంటుంది.
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొమొడోను భలే ఇరికించిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఎంతో చాకచక్యంగా తప్పించుకున్న మేక’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 22 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..