Share News

Viral Video: పార్లే-జీని ఇలా మార్చేశాడేంటీ.. ఈ పెయింటర్ పనితనం చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:53 PM

కొందరు తాము చేసే పనిలో పనితనం చూపిస్తూ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఇంకొందరు ఎవరూ ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచిస్తూ చివరకు అద్భుతాలను సృష్టిస్తుంటారు. ఇంకొందరు చేసే పనిలోనే క్రియేటివిటీని మిక్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: పార్లే-జీని ఇలా మార్చేశాడేంటీ.. ఈ పెయింటర్ పనితనం చూస్తే.. నోరెళ్లబెడతారు..

కొందరు తాము చేసే పనిలో పనితనం చూపిస్తూ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఇంకొందరు ఎవరూ ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచిస్తూ చివరకు అద్భుతాలను సృష్టిస్తుంటారు. ఇంకొందరు చేసే పనిలోనే క్రియేటివిటీని మిక్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పార్లే-జీ బిస్కట్‌ను వినూత్నంగా మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ పెయింటర్ టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హిందీలో ప్రసారమయ్యే ‘‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’’ టీవీ షోలో జెతలాల్ పాత్ర గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. 17 ఏళ్ల క్రితం ఆ పాత్ర ద్వారా జనం ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న దిలీప్ జోషిని.. తాజాగా ఓ పెయింటర్ తాజాగా అందరికీ వినూత్నంగా పరిచయం చేశాడు. ఏకంగా పార్లే-జి ప్యాకెట్‌పై ఉన్న చిన్నారి బొమ్మపై దిలీప్ జోషి చిత్రాన్ని (Dilip Joshi Picture on Parle-G packet) గీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Viral Video: పెళ్లిలో గన్లు పట్టుకుని ఫోజులు ఇచ్చిన వధూవరులు.. మధ్యలో వధువుకు ఊహించని షాక్.. చివరకు..


ముందుగా బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న బాలుడి చిత్రంపై రంగు పూశాడు. ఆ తర్వాత దానిపై దిలీప్ జోషి చిత్రాన్ని గీశాడు. అది కూడా అచ్చుగుద్దినట్లు ఆ ఫొటోను దించేశాడు. ఇది చూసేందుకు కంపెనీ వారే ఇలా ముంద్రించారేమో అన్నట్లుగా ఆ చిత్రాన్ని గీశాడు. ఈ బొమ్మ గీయడం ద్వారా జెతలాల్‌ పాత్రను కాస్తా.. పార్లే-జి జెతలాల్‌గా మార్చేశాడన్నమాట. అప్పట్లో అందరి మనుషులను దోచుకున్న జెతలాల్ పాత్రను.. ఇలా పార్లే-జి ప్యాకెట్‌పై గీసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.

Viral Video: నీళ్లలో ఉన్నాననే ధైర్యంతో ఏనుగు పైనే దాడి చేసింది.. చివరకు మొసలి పరిస్థితి ఏమైందో చూస్తే..


కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఇది చాలా అద్భుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పెయింటర్ టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ‘‘పార్లే-జీని కాస్తా జెతలాల్-జీ గా మార్చేశాడుగా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 96 వేలకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Small House Video: ఇంటిని ఇలాక్కూడా కట్టొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ ఇంజినీర్ తెలివి మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 07 , 2025 | 04:53 PM