Viral Video: ఇది మరీ కామెడీ భయ్యా.. స్నేహితుడిని ఎలా పడేశారో చూస్తే.. పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Jan 31 , 2025 | 01:26 PM
ఇద్దరు వ్యక్తులు ఓ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తారు. అక్కడే ఉన్న రెండు కుర్చీల్లో కూర్చుని భోజనం చేస్తుంటారు. ఇంతలో వారి స్నేహితుడు కూడా అక్కడికి వస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వివిధ రకాల ప్రాంక్‌లు చేస్తుంటారు. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో అందరినీ ఆటపట్టించడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు చేసే ప్రాంక్‌లు ఎదుటివారిని ఇబ్బంది పెడితే.. మరికొందరు చేసే ప్రాంక్‌లు తెగ నవ్విస్తుంటాయి. ఈ తరహా తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు.. తమ స్నేహితుడిపై చేసిన ప్రాంక్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది మరీ కామెడీ భయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఓ ఫుడ్ స్టాల్ (Food stall) వద్దకు వస్తారు. అక్కడే ఉన్న రెండు కుర్చీల్లో కూర్చుని భోజనం చేస్తుంటారు. ఇంతలో వారి స్నేహితుడు కూడా అక్కడికి వస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది.
Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. సడన్‌గా సమీపానికి దూసుకొచ్చిన చేప.. చివరకు..
భోజనం ప్లేటును చేతిలో పట్టుకున్న ఆ వ్యక్తి కుర్చీపై కూర్చోవడానికి వెళ్తాడు. తన ఇద్దరు స్నేహితుల మధ్యలో మరో వ్యక్తి కూర్చోవడానికి స్థలం ఉండడంతో అక్కడికి వెళ్తాడు. అయితే తీరా దానిపై కూర్చోవడానికి ప్రయత్నించగా.. సడన్‌గా ఆ ఇద్దరు స్నేహితులు పైకి లేస్తారు. దీంతో మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో (man tried to sit on chair and fell down) కూర్చోవడానికి ప్రయత్నించి అతను కిందపడిపోతాడు. రెండు కుర్చీలపై కూర్చున్న ఆ ఇద్దరు మధ్యలో ఖాళీ స్థలం కనిపించకుండా దుప్పటి కప్పేశారన్నమాట.
Viral Video: వామ్మో.. వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. తలుపు తీసి చూడగా లోపలి నుంచి ఒక్కసారిగా..
ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి వారిపై కోపంతో కుర్చీ ఎత్తుకొని కొట్టడానికి వెంటపడతాడు. అతడి ఆవేశాన్ని చూసిన ఆ ఇద్దరూ అక్కడి నుంచి పరరవుతారన్నమాట. ఇదంతా నవ్వుకోవడం కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 55 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ప్రాణాలంటే లెక్కే లేదా.. ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..