Share News

Champions Trophy 2025: టీమిండియాపై కుట్రకు ప్లాన్.. ఫలితం అనుభవించక తప్పలేదు

ABN , Publish Date - Feb 27 , 2025 | 02:43 PM

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ ఊహించని మలుపులు తిరుగుతోంది. టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ సెమీస్‌ రేసు నుంచి తప్పుకుంది. ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టింది.

Champions Trophy 2025: టీమిండియాపై కుట్రకు ప్లాన్.. ఫలితం అనుభవించక తప్పలేదు
Champions Trophy 2025

ఒకరి బాగు కోసం ఆలోచిస్తే మనకూ మంచే జరుగుతుంది. ఒకరికి చెడు జరగాలని తలచితే మనకూ అదే జరుగుతుందని పెద్దలు అంటుంటారు. స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, అసూయతో కుట్ర పన్నితే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిస్తుంటారు. ఈ మాటలు సరిగ్గా ఇంగ్లండ్ జట్టుకు సూట్ అవుతాయి. టీమిండియాపై ఆ జట్టు పన్నిన కుట్రలు భగ్నమవడమే కాదు.. వాళ్లకే రివర్స్‌లో ఊహించని షాక్ తగిలింది. భారత్ మీద ఏడుస్తూ వచ్చిన ఇంగ్లీష్ టీమ్ మరోమారు ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది. అసలు.. ఇంగ్లండ్ పన్నిన కుట్ర ఏంటి? టీమిండియాను ఏ విషయంలో ఇబ్బంది పెట్టారు? అనేది ఇప్పుడు చూద్దాం..


పక్కా అనుకూలమంటూ..

చాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్పటి నుంచి టీమిండియాపై ఏడుస్తోంది ఇంగ్లండ్. భారత్ మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరగడం వల్ల ఆ టీమ్‌కు మిగతా జట్ల కంటే అదనపు ప్రయోజనం కలుగుతోందంటూ ఇంగ్లండ్ సీనియర్లు నాసిర్ హుస్సేన్, మైకేల్ వాన్ వంటి ప్రముఖులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకే గ్రౌండ్‌లో ఆడటం వల్ల ప్రయాణ భారం లేకపోవడం, పిచ్‌‌తో పాటు కండీషన్స్‌కు ఈజీగా అలవాటు పడటం టీమిండియాకు అనుకూలమంటూ చెప్పుకొచ్చారు. క్రికెట్‌పై భారత్ పెత్తనం నడుస్తోందని.. ఇతర జట్లకు లేని బెనిఫిట్స్ రోహిత్ సేనకు ఎందుకంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.


ఫలితం అనుభవించారు

వాన్, హుస్సేన్‌కు తోడుగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్లు కూడా భారత్‌పై విషంగక్కారు. టీమిండియా కప్పు గెలవొద్దనో ఏమో వరుసగా విమర్శలు ఎక్కుపెడుతూ రెచ్చగొడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే ఇంగ్లండ్ టీమ్‌కు రివర్స్ అయింది. ఆ జట్టు వరుసగా ఆసీస్, ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది. సెమీస్ లేదా ఫైనల్స్‌లో భారత్ చేతుల్లో దుబాయ్ వేదికగా ఓడి ఉంటే కొత్త కుట్రకు తెరదీసే అవకాశం ఉండేది. కానీ చిన్న జట్టయిన ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడటంతో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు.


ఆడలేక మద్దెల ఓడు

భారత్‌ మీద ఇంగ్లండ్, ఆసీస్ లాంటి పలు దేశాలు దుమ్మెత్తిపోయడం సరైనదేనా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే బీసీసీఐ ఒప్పుకుంది కాబట్టే చాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. మన టీమ్ దుబాయ్‌లో ఆడుతుందని ముందే నిర్ణయించారు. ఒకవేళ ఏదైనా దేశం భారత మ్యాచులు, వేదికల గురించి అభ్యంతరం వ్యక్తం చేయాలని అనుకుంటే ముందే చేయాల్సింది. కానీ అంతా అయిపోయాక, టోర్నీ సగానికి చేరుకున్నాక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనని ఇంగ్లీష్ టీమ్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్

తాలిబన్ల రాజ్యంలో టపాసుల మోత

టీమిండియాతో చేరిన మోర్కెల్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2025 | 02:49 PM