Share News

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ ఫుల్ స్క్వాడ్స్.. ఆ 3 జట్లతో భారత్‌కు యమా డేంజర్

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:02 PM

Champions Trophy 2025 Full Squads: చాంపియన్స్ ట్రోఫీలో ఆడే 8 టీమ్స్ ఫుల్ స్క్వాడ్స్ ఏంటో క్లారిటీ వచ్చేసింది. మరి.. ఏ జట్టు బలంగా ఉంది? కప్పు కొట్టాలంటే రోహిత్ సేన ఎవర్ని ఓడిస్తే సరిపోతుందో ఇప్పుడు చూద్దాం..

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ ఫుల్ స్క్వాడ్స్.. ఆ 3 జట్లతో భారత్‌కు యమా డేంజర్
Champions Trophy 2025

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. ఐసీసీ ట్రోఫీ కోసం మరో నాలుగు రోజుల్లో మహా సంగ్రామం మొదలుకానుంది. ఈసారి భారత జట్టు హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్-2023 రన్నరప్ కావడం, టీ20 ప్రపంచ కప్-2024ను గెలుచుకోవడం, ఈ ఫార్మాట్‌టో తిరుగులేని రికార్డు ఉండటం, టీమ్ నిండా స్టార్లు ఉండటం, ఇంగ్లండ్‌ను చిత్తు చేసి దూకుడు మీద ఉండటంతో భారత జట్టును టైటిల్ ఫేవరెట్‌గా ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే రోహిత్ సేనకు ప్రధానంగా 3 జట్లతో యమా డేంజర్ ఉందని హెచ్చరిస్తున్నారు. మరి.. ఆ మూడు జట్లు ఏవి? అసలు ఏయే టీమ్ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం..


ఆదమరిస్తే అంతే సంగతులు!

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఉన్న గ్రూప్‌లోనే బంగ్లాదేశ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ప్రమాదకర న్యూజిలాండ్ ఉన్నాయి. ఇందులో పాక్‌ డేంజరస్‌గా కనిపిస్తోంది. ఆ టీమ్ ఈ మధ్య వన్డేల్లో బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. దానికి తోడు సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండటం, తమ దేశంలో ఆడేందుకు భారత్ నో చెప్పడంతో కసి మీద ఉంది. అందుకే ఆ టీమ్‌తో రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫేవరెట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తోనూ మనకే డేంజరే. కమిన్స్ సహా పలువురు స్టార్లు లేకపోయినా కంగారూలను తక్కువ అంచనా వేయడానికి లేదు. మనతో సిరీస్ ఓడిపోయారని ఇంగ్లీష్ టీమ్‌ను లైట్ తీసుకోలేం. కివీస్ కీలక మ్యాచుల్లో ఎలా ఆడుతుందో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ఈ నాలుగు జట్ల స్క్వాడ్స్ ఒకసారి పరిశీలిద్దాం..


భారత్:

రోహిత్ శర్మ (సారథి), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్:

మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, విల్ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, నాథన్ స్మిత్, విల్ యాంగ్, జేకబ్ డఫ్ఫీ.


పాకిస్థాన్:

మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫకర్ జమాన్, కమ్రాన్ ఘులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీం అష్రఫ్, ఖుష్‌దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, మహ్మద్ హస్నేయిన్, నసీం షా, షాహీన్ షా అఫ్రిదీ.

ఇంగ్లండ్:

జోస్ బట్లర్ (సారథి), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టాప్ బేంటన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియాం లివింగ్‌స్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహ్‌మూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

ఆస్ట్రేలియా:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షూస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడం జంపా.


ఇవీ చదవండి:

అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్

బీసీసీఐకి భారీగా బొక్క పెట్టిన స్టార్ బ్యాటర్

‘చాంపియన్స్‌’ విజేతకు రూ.19.40 కోట్లు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 15 , 2025 | 03:05 PM

News Hub