IND vs PAK: దిగొచ్చిన పాకిస్థాన్.. భారత్ అంటే ఫైరు అనుకుంటివా.. వైల్డ్ ఫైరు
ABN , Publish Date - Feb 19 , 2025 | 01:22 PM
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్‌తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.

చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందే పాకిస్థాన్‌కు ఘోర అవమానం చోటుచేసుకుంది. భారత్‌తో ఆడుకుందామని భావించిన దాయాది తాను తీసిన గోతిలో తానే పడింది. మెగా టోర్నీ స్టార్ట్ అవడానికి ముందు రీసెంట్‌గా కరాచీ స్టేడియంలో జరిగిన ఓ ఘటన వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ మైదానంలో అన్ని దేశాల జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను ప్రదర్శించకపోవడంతో దాయాదిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగొచ్చిన పాక్ క్రికెట్ బోర్డు.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
అంతకంతా అనుభవించాల్సిందే!
పెద్ద పెట్టున విమర్శలు రావడంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్థాన్.. కరాచీ స్టేడియంలో తాజాగా భారత పతాకాన్ని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. భారత్ అంటే ఫైరు అనుకుంటివా.. కాదు, వైల్డ్ ఫైరు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. బోర్డర్‌లోనే కాదు.. క్రికెట్‌లోనూ భారత్‌తో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మెగా టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో పాక్‌కు పరాభవం తప్పదని.. అంతకంతా అనుభవించాల్సిందేనని చెబుతున్నారు. జెండా ప్రదర్శించకపోవడం తర్వాత మళ్లీ దిద్దుబాటు చేయడం లాంటి పనులతో పీసీబీ పరువు పోగొట్టుకోవడం తప్ప సాధించిందేమీ లేదని దుయ్యబడుతున్నారు.
ఏకంగా 12 వేల మందితో..
భారత జెండా వివాదాన్ని పక్కనబెడితే.. పాక్‌లో మెగా టోర్నీ కోసం భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ దేశంలో 29 ఏళ్ల తర్వాత జరుగుతున్న మేజర్ ఈవెంట్ కావడంతో అక్కడి ప్రభుత్వం ఆటగాళ్ల భద్రత, మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అన్ని మ్యాచులకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు కలిపి 9 స్పెషల్ చాప్టర్ ఫ్లైట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మ్యాచులకు ఆతిథ్యం ఇస్తున్న కరాచీ, లాహోర్, రావల్పిండిలో 12 వేల మంది పోలీసులతో పహారాను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. సెక్యూరిటీ కోసం 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1200 మంది అప్పర్ సబ్‌ఆర్డినేట్లు, 10,556 మంది కానిస్టేబుల్స్, 200 మంది మహిళా పోలీసు అధికారులను నియమించారని సమాచారం.
ఇవీ చదవండి:
కర్రాన్ సెంచరీ.. జింబాబ్వేదే సిరీస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి