Share News

India vs Pakistan: మ్యాచ్‌కు ముందే పాక్‌కు షాక్.. మనోళ్లు కొడితే ఇట్లుంటది

ABN , Publish Date - Feb 22 , 2025 | 08:45 AM

PCB: మ్యాచ్‌కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్‌కు ఇచ్చిపడేస్తున్నారు.

India vs Pakistan: మ్యాచ్‌కు ముందే పాక్‌కు షాక్.. మనోళ్లు కొడితే ఇట్లుంటది
Champions Trophy 2025

పాకిస్థాన్‌ను భారత్ నిద్రపోనివ్వడం లేదు. చాంపియన్స్ ట్రోఫీ విషయంలో మొదలైన గొడవ టోర్నమెంట్ స్టార్ట్ అయినా ఇంకా కంటిన్యూ అవుతోంది. 29 ఏళ్ల తర్వాత ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చిందని గంతులేసిన పాక్ క్రికెట్ బోర్డు.. భారత్‌తో కయ్యానికి దిగి లేనిపోని సమస్యలు తెచ్చుకుంది. భద్రతా కారణాలు రీత్యా ఆ దేశానికి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఈ వివాదం పీక్స్‌కు చేరుకుంది. రోహిత్ సేన ఎలాగైనా పాక్‌కు రావాల్సిందేనని పీసీబీ పట్టుబట్టినా ఐసీసీలో జైషా రాకతో వాళ్లకు నిరాశ తప్పలేదు. భారత మ్యాచులు దుబాయ్‌కు తరలించింది ఐసీసీ. అయితే ఇక్కడితో అంతా సమసిపోలేదు. తాజాగా మరో కాంట్రీవర్సీ మొదలైంది.


తట్టుకోలేకపోతున్న పీసీబీ!

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం మ్యాచ్ జరగనుంది. సెమీస్ వెళ్లాలంటే రెండు జట్లకు ఈ పోరు చాలా కీలకంగా మారింది. పాక్‌కు ఇది చావోరేవో మ్యాచ్. ఓడితే ఆ టీమ్ ఇంటిదారి పట్టాల్సిందే. అందుకే ఎలాగైనా రోహిత్ సేనను ఓడించి తీరాలని దాయాది భావిస్తోంది. అయితే న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడటం, ఫఖర్ జమాన్ లాంటి క్వాలిటీ బ్యాటర్ గాయంతో దూరమవడం, ఉన్న ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోవడంతో ఆ టీమ్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ తరుణంలో భారత్ నుంచి ఆ జట్టుకు గట్టి షాకులు తగులుతున్నాయి. పుండు మీద కారం చల్లినట్లు పాక్‌ను ఇన్‌డైరెక్ట్‌గా రెచ్చగొడుతోంది భారత్. బంగ్లాదేశ్ మ్యాచే దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు. ఆ మ్యాచ్ బ్రాడ్‌కాస్టింగ్‌లో పాక్ పేరు లేకపోవడంతో పీసీబీ తట్టుకోలేకపోతోంది.


పాక్ ఊసే లేదు!

భారత మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరుగుతున్నప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్య దేశంగా ఉన్నందున పాకిస్థాన్ పేరును లైవ్ బ్రాడ్‌కాస్టింగ్‌లో వాడాలి. కానీ భారత్-బంగ్లా మ్యాచ్ సమయంలో లైవ్ ఫీడ్‌లో ఎడమ వైపున చాంపియన్స్ ట్రోఫీ అనే లోగో మాత్రమే కనిపించింది. దీంతో హర్ట్ అయిన పాక్ బోర్డు.. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలర్ట్ అయిన అత్యున్నత బోర్డు పాక్-భారత్ మ్యాచ్‌లో ఈ తప్పు రిపీట్ అవ్వదని క్లారిటీ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్.. అప్పట్లో జెర్సీ మీద పాక్ పేరు పెట్టకుండా మొదట టీమిండియా షాక్ ఇచ్చిందని, ఇప్పుడు ఆ దేశం పేరు లేకుండా టెలికాస్ట్ చేసి మరో షాక్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఓటమితో డీలాపడిన దాయాదికి ఈ అవమానం మరింత బాధపెడుతుందని చెప్పొచ్చు.


ఇవీ చదవండి:

మొనగాడి ఎంట్రీ.. పాక్‌కు ఇక కాళరాత్రే

మా దెబ్బ మామూలుగా ఉండదు.. హార్దిక్ వార్నింగ్

రంజీ ట్రోఫీలో 68 ఏళ్లలో తొలిసారి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2025 | 09:06 AM