Share News

Rohit-Hardik: మేం కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు.. రోహిత్ ముందే హార్దిక్ వార్నింగ్

ABN , Publish Date - Feb 21 , 2025 | 06:47 PM

IPL 2025: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ ముందే హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ అతడు ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit-Hardik: మేం కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు.. రోహిత్ ముందే హార్దిక్ వార్నింగ్
IPL 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ మొదలుకానుంది. చాంపియన్స్ ట్రోఫీ హంగామా ముగిసిన వెంటనే ఐపీఎల్‌ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఇతర జట్లకు వార్నింగ్ ఇచ్చాడు ఎంఐ సారథి హార్దిక్ పాండ్యా. రోహిత్ శర్మ ముందే ఇతర టీమ్స్‌ను అతడు గట్టిగా హెచ్చరించాడు. ఇంతకీ పాండ్యా ఏమన్నాడంటే..


దెబ్బ మామూలుగా ఉండదు!

ముంబై ఇండియన్స్ తడాఖా ఏంటో ఐపీఎల్-2025లో చూపిస్తామని పాండ్యా అన్నాడు. ఎంఐ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. బ్లూ, గోల్డ్ కలర్స్‌తో మిళితమైన జెర్సీతో ఫ్రెష్‌గా బరిలోకి దిగుతామన్నాడు. తాము కొట్టే దెబ్బ మామూలుగా ఉండదన్నాడు హార్దిక్. ముంబై ఎలా ఆడుతుందని అంతా ఊహిస్తారో ఆ రేంజ్‌లోనే పెర్ఫార్మ్ చేస్తామన్నాడు. ఇది జెర్సీ మాత్రమే కాదు.. అభిమానులకు తమ వాగ్దానమని చెప్పుకొచ్చాడు. వాంఖడేకు వెళ్దాం పదండి అంటూ ఎంఐ విడుదల చేసిన వీడియోలో జోష్‌గా మాట్లాడుతూ కనిపించాడు పాండ్యా.


గర్జించేందుకు రెడీ!

ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ వీడియోలో పాండ్యాతో పాటు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా కూడా సందడి చేశారు. అయితే పాండ్యా మాటలే హైలైట్‌గా నిలిచాయి. ‘గత సీజన్‌లో అనుకున్న విధంగా ఆడలేకపోయాం. కానీ ఇప్పుడు కొత్త సీజన్ వచ్చేస్తోంది. ఈసారి లెక్కలు మారుస్తాం. ఐపీఎల్-2025 మాకు మంచి అవకాశం. ఎంఐ పవర్ చూపించడానికి ఇదే చాన్స్’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. బరిలోకి దిగి గర్జించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.


ఇవీ చదవండి:

రంజీ ట్రోఫీలో 68 ఏళ్లలో తొలిసారి

కేఎల్ రాహుల్‌కు అరుదైన అవార్డు

రాహుల్ వల్ల తిట్లు తింటున్న హార్దిక్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 06:50 PM