GHMC: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా
ABN , Publish Date - Mar 17 , 2025 | 06:04 PM
GHMC: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జూబ్లీహిల్స్, రహమత్ నగర్‌లో పలు నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ కూల్చివేతలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్, రహమత్ నగర్‌లో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన వైన్ షాప్‌తో పాటు షెడ్లను నేలమట్టం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, స్థానికుల ఫిర్యాదుతో అక్రమాలను కూల్చివేశారు. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చిన వైన్ షాపుల నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
Hyderabad: ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
For Telangana News And Telugu News