Home » Illegal Constructions
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. అల్మాస్ గూడలో మంగళవారం ఉదయం నుంచి మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా కొనసాగాయి. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు భయాందోళలనలు చెందుతున్నారు.
రోడ్డును ఆక్రమించి ఓ లేఅవుట్లో నిర్మించిన ఇంటిని సోమవారం ఉదయం హైడ్రా బృందాలు కూల్చివేశాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలోని బీరంగూడ వందనపురి కాలనీలో సర్వేనంబర్ 848 పరిఽధిలోకి వచ్చే రోడ్డును ఆక్రమించి రిజిస్టర్ డాక్యుమెంట్ సృష్టించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజిగూడలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు మద్య అధికారులు సోమవారం తొలగించారు.
తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా . దీనిని ఏర్పాటు చేసి మూడున్నర నెలలు దాటింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చాలా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
‘‘రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది చూస్తున్నారు. ఉన్నవీ లేనివీ చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మరిచిపోవద్దని అన్నారు. చెరువులు ఎవరు కబ్జా చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కమర్షియల్ కాంప్లెక్స్‌లు అక్రమంగా ఉంటే కూల్చాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. పేదలకు అన్యాయం చేయొద్దని తెలిపారు. భారత దేశంలో మౌలిక సదుపాయాల కొసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. హైవేలకు , ఎక్స్‌ప్రెస్ హైవే లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అయితే... ఎక్స్‌ప్రెస్ హైవేలో సైడ్స్‌లో చాలా హైట్‌లో గోడలు కడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు.
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. వాటికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.