Share News

Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బోటు దగ్ధం

ABN , Publish Date - Jan 26 , 2025 | 09:46 PM

Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బోటు దగ్ధమవడంతో పలువురికి గాయాలయ్యయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బోటు దగ్ధం
Hussain Sagar fire accident

హైదరాబాద్‌: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లలో అపశృతి సంభవించింది. హుస్సేన్ సాగర్‌లో రెండు పడవల్లో అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచా పేలి రెండు పడవల్లో మంటలు వ్యాపించాయి బోట్ల దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాద సమయంలో పడవల్లో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా వారంతా బయటపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, బీజేపీ ఎంపీలు, ప్రముఖులు ఉన్నారు. ఏడేళ్లుగా భరతమాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బోట్లలో ఉన్న పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..

Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 26 , 2025 | 10:01 PM