Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ABN , Publish Date - Jan 04 , 2025 | 08:59 PM
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. రైతుభరోసా విధివిధానాలను కేబినెట్ ఖరారు చేసింది. కొత్త రేషన్‌కార్డులు, సమగ్ర కులగణనపై భేటీలో చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. రైతుభరోసా విధివిధానాలను కేబినెట్ ఖరారు చేసింది. కొత్త రేషన్‌కార్డులు, సమగ్ర కులగణనపై భేటీలో చర్చించారు. భూమిలేని పేదలకు భృతి, సన్నబియ్యం పంపిణీపై చర్చించారు. టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి నుంచి సన్నబియ్యానికి కేబినెట్ ఆమోదించింది. టూరిజం పాలసీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంక్షలు లేని రైతు భరోసాకు ఆమోదం తెలిపింది. సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పంచాయతీరాజ్‌లో 508 కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. కొత్త గ్రామ పంచాయతీలను కేబినెట్ ఆమోదించింది. ములుగు గ్రామపంచాయతీని ములుగు మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది.
ఆ ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు..
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయలను పరిశీలించేందుకు టెక్నీకల్ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది..? ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది..? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి..? ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2, ఫేజ్-3కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
మున్సిపల్ కార్పొరేషన్‌గా కొత్తగూడెం అప్‌గ్రేడ్
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్తగూడెం టౌన్ (36 వార్డులు), పాల్వంచ టౌన్ (24 వార్డులు), సుజాతనగర్ (7 పంచాయతీ)లను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్‌రెడ్డికు ప్రతిపాదన చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పాతికేళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటికి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG News: కేక్ తింటున్నారా.. జాగ్రత్తండోయ్
Hyderabad: కొంతమంది తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
HYDRA: హైడ్రా మరో కీలక నిర్ణయం..
Read Latest Telangana News And Telugu News