Home » Congress Jana Jathara
ఈ ఎన్నికల్లో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.
Congress Jana Jathara Sabha at Narsapur: నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధానా పార్టీలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. తెలంగాణలో(Telangana) ఏప్రిల్ 13న పోలింగ్ జరగనుండగా.. 11వ తేదీన సాయంత్రం నుంచి ప్రచారానికి తెరపడనుంది.
కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Mod) కాలనాగు లాంటి వాడని.. .పగబడితే విడవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బ్రిటిష్ వారు గుజరాత్ నుంచి లోపలికి వచ్చారని... ఇండియాలో మనలో మనకే గొడవలు పెట్టారని విరుచుకుపడ్డారు.
భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్థం ప్రకటించిన బీజెపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటోందని.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలను అదిరించి, బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం
నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర (Jana Jathara) భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో ఎటుచూసినా జనాలే కనిపిస్తున్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని మాటిచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందే.. వారికి న్యాయం జరగాల్సిందేనని భవిష్యత్‌లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు..
‘గత ముఖ్యమంత్రి (కేసీఆర్) తెలంగాణలో వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేయించారు. నిఘా సంస్థలు, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేసి, ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేసి, పరికరాలను నదిలో పడేశారు. రాష్ట్రంలో పలు వర్గాలను బెదిరించి, భయపెట్టి, బలవంతంగా వసూళ్లు చేశారు. కొత్త ప్రభుత్వం ట్యాపింగ్‌పై
తుక్కుగూడ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు.
బీఆర్ఎస్ (BRS) కు లోక్‌సభ ఎన్నికల ముందు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్న సమయంలో గులాబీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే కోవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కూడా గులాబీ పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.