KTR: సీఎం రేవంత్ పచ్చి అబ్బద్దాలు మాట్లాడుతున్నారు.. కేటీఆర్ ధ్వజం
ABN , Publish Date - Jan 05 , 2025 | 02:41 PM
కాంగ్రెస్ హామీలు అమలు చేయమంటే రేవంత్ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. వరంగల్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ చెత్త బుట్టలో వేసిందని విమర్శించారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని పచ్చి మోసానికి సీఎం రేవంత్ తెరదీశారని ఆరోపించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతులకు తీరని ద్రోహం, అన్యాయం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(ఆదివారం) కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ రైతుభరోసా కాదు.. రైతులను పూర్తిగా నిరాశ పరిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులు పాతరేయటానికి రెడీగా ఉన్నారని హెచ్చరించారు.సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి ఏపీలోనే బాగుందనటం రేవంత్ బావదారిద్ర్యానికి ఉదాహరణ అని చెప్పారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయమంటే రేవంత్ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు కష్టమెస్తే వస్తానని చెప్పిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ చెత్త బుట్టలో వేసిందని విమర్శించారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని పచ్చి మోసానికి సీఎం రేవంత్ తెరదీశారని ఆరోపించారు. రేవంత్‌తో స్నేహం చేస్తున్న. భట్టి కూడా అప్పులపై అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Dr. Lakshman: కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
KTR: మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్
HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..
Read Latest Telangana News and Telugu News