Share News

Minister Thummala: రైతులకు పరిహారం చెల్లించేలా ఆ చట్ట సవరణ చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:19 PM

Minister Thummala Nageswara Rao: వచ్చే ఐదేళ్లలో 4లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరణ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

Minister Thummala: రైతులకు పరిహారం చెల్లించేలా ఆ చట్ట సవరణ చేయాలి
Minister Thummala Nageswara Rao

ఢిల్లీ: పచ్చిరొట్ట ఎరువుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇవాళ(శనివారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల హాజరయ్యారు. 53,617 మెట్రిక్‌ టన్నుల సోయా సేకరించినట్లు తుమ్మల వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... వచ్చే ఐదేళ్లలో 4లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ గెలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని అన్నారు. పసుపు, మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. రైతులకు పరిహారం చెల్లించేలా విత్తన చట్టసవరణ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.


కాగా తెలంగాణ కేబినెట్‌ సమావేశం శనివారం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ అయింది. రైతుభరోసా విధివిధానాలను కేబినెట్‌ ఖరారు చేసింది. కొత్త రేషన్‌కార్డులు, సమగ్ర కులగణనపై భేటీలో చర్చించారు. భూమిలేని పేదలకు భృతి, సన్నబియ్యం పంపిణీపై చర్చించారు. టూరిజం, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG News: కేక్ తింటున్నారా.. జాగ్రత్తండోయ్

Hyderabad: కొంతమంది తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

HYDRA: హైడ్రా మరో కీలక నిర్ణయం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 04 , 2025 | 08:52 PM