Sankranti: సంక్రాంతి పండుగ వేళ.. రైల్వేశాఖ గుడ్‌న్యూస్
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:41 AM
Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అదనపు రైళ్లను నడపాడానికి దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అదనపు రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 26 అదనపు రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ అదనపు రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి, సికింద్రాబాద్ – బెంగళూరు మధ్య అదనపు రైళ్లను నడపుతున్నట్లు వివరించారు.
ఏపీకి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – విశాఖపట్నం మధ్య జనసాధారణ్ ఆన్‌రిజర్వుడ్ రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు. చర్లపల్లి నుంచి విశాఖకు ఈ నెల 11, 13, 16, 18, 20, 25 తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటామని అన్నారు. చర్లపల్లిలో ఉదయం10 గంటలకు బయలుదేరి విశాఖపట్నానికి రాత్రి 10 గంటలకు ఈ ట్రైన్లు చేరుకుంటాయన్నారు. అలాగే విశాఖ నుంచి చర్లపల్లికి ఈ నెల 10, 12, 15, 17, 20, 25 తేదీల్లో రైళ్లు నడుస్తాయని చెప్పారు. విశాఖ నుంచి సాయంత్రం 6.20గంటలకు బయలుదేరి ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: టికెట్ రేట్ల పెంపు ఎవరి కోసం..!
High Court: బెనిఫిట్ షోలు రద్దంటూ.. స్పెషల్ షోకు అనుమతులా?
Read Latest Telangana News and Telangana News