Share News

Minister Thummala: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:01 AM

Minister Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో కరెంట్ షార్ట్ సర్క్యూట్‌ జరిగిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం చేయడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Minister Thummala: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
Minister Thummala Nageswara Rao

ఖమ్మం: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అరవింద్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నానని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెబితే అరవింద్‌కు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ(గురువారం) మంత్రి తుమ్మల పర్యటించారు. నిన్న(బుధవారం) రాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైన పత్తి బస్తాలను పరిశీలించారు. అగ్ని ప్రమాద కారణాలపై మంత్రికి మార్కెట్ అధికారులు వివరించారు.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... అగ్ని ప్రమాద ఘటనలో పత్తి బస్తాలు దగ్ధం అవ్వడం దురదృష్టకరమని చెప్పారు. భవిష్యత్‌లో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా రూ.100 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. రూ. 2 వేల కోట్లతో హైదరాబాద్ కోహెడలో మెగా మార్కెట్ నిర్మాణం కోసం సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారని అన్నారు. రైతులకు సౌకర్యంగా ఉండేలా వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.


ఖమ్మం మిర్చి మార్కెట్ ఘాటు వల్ల 20వ డివిజన్ ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. మిర్చి మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా మద్దులపల్లి మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఖమ్మం మార్కెట్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో కరెంట్ షార్ట్ సర్క్యూట్‌ జరిగిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం చేయడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖమ్మం మార్కెట్‌లో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

Formula E Case: ఈడీ విచారణకు కేటీఆర్

Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..

Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2025 | 11:08 AM