Harish Rao: ఆ పరిస్థితులు మారిపోయాయి.. లైట్ తీసుకోవద్దు
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:42 PM
Harish Rao: దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని హరీష్‌రావు చెప్పారు.

సిద్దిపేట : మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలని.. ముందు తరాలకు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఆదివారం నాడు సిద్దిపేట బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవం పంచాంగ శ్రవణంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. విశ్వావసు నామ సంవత్సరం సిద్దిపేట, రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో క్షేమంగా ఉండాలని హరీష్‌రావు అన్నారు.
గతంలో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాముఖ్యత ఉండేదని.. అది ఆధునిక ప్రపంచంలో క్రమంగా కోల్పోతుందని హరీష్‌రావు చెప్పారు. అందరూ యూట్యూబ్‌లోనే జాతకం చూసుకుంటున్నారని తెలిపారు. రానురాను పంచాంగ శ్రవణ ప్రాముఖ్యం తగ్గుతుందన్నారు. నేడు మన చేతిలో ఉన్న మొబైల్ మనల్ని ఏకాగ్రతగా ఉండనియడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని చెప్పారు. బ్రాహ్మణులు బాగుంటే దేవుడికి పూజాదికాలు బాగా అందుతాయన్నారు. సమాజం సుభిక్షంగా ఉంటుందని హరీష్‌రావు తెలిపారు.
దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని హరీష్‌రావు చెప్పారు. వేదాలను, దేవుడిని, బ్రాహ్మణులను గౌరవించే వ్యక్తి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్తును ఒక ఆధ్యాత్మిక వేదికగా మార్చాలని అన్నారు. ప్రతి సమాజానికి ఆధ్యాత్మిక భావన ఎంతో ముఖ్యమని.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు, పోలీసులు చేయలేని పనిని దేవుడిపై భక్తితో చేయగలుగుతామని అన్నారు. విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా పాటిస్తే.. మనం మాత్రం లైట్ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంత దగ్గర చేస్తే సమాజం అంత సుభిక్షంగా ఉంటుందని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తున్నామని ప్రకటించారు. హిందూ ధర్మ పరిరక్షణను నిలబెట్టుకుంటూ, పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను అందించాలని హరీష్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి
CM Revanth Reddy: ఉగాది పచ్చడిలా తెలంగాణ బడ్జెట్ షడ్రుచుల సమ్మిళితం: సీఎం రేవంత్ రెడ్డి..
దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News and Telugu News