Weather Update: పండుగ ముందు బ్యాడ్ న్యూస్.. నిన్నటి వరకు చలి.. రేపటి నుంచి..
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:12 AM
సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా పండుగ హడావుడి మామూలుగా లేదు. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్.
సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా పండుగ హడావుడి మామూలుగా లేదు. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్. వాతావరణం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. నిన్నటి వరకు అంతా చలే చలి అన్నట్లు ఉండేది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కానీ హఠాత్తుగా అంతా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలను వరుణుడు భయపెడుతున్నాడు. దీంతో పండుగ సెలబ్రేషన్స్ ఎంత వరకు ఉంటాయనేది అయోమయంగా మారింది. మరి.. రాబోయే మూడ్నాల్రోజులు వాతావరణం ఎలా ఉండనుంది? సంక్రాంతికి వాన ముప్పు ఎంత వరకు ఉంటుంది? అనేది ఇప్పుడు చూద్దాం..
అక్కడ భారీ వర్షాలు!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీని వల్ల కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో జనవరి 13వ తేదీ నాడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జనవరి 12వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. భోగి పండుగ నాడు ఏపీకి వర్షసూచన ఉందని వెల్లడించింది.
వాళ్లు జాగ్రత్త!
శాటిలైట్ అంచనా ప్రకారం శుక్రవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వచ్చీపోతుంటాయి. చలి కొంతమేర తగ్గినా.. గాలి వేగం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడా వాన పడే చాన్స్ లేదు. సొంతూళ్లకు ప్రయాణమయ్యే వారికి ఇవాళ వెదర్ చాలా బాగుంటుంది. అయితే ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి అలర్ట్. టూ వీలర్స్ మీద వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.
ఊళ్లకు వెళ్లేందుకు బెస్ట్ టైమ్!
ఇవాళ తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అదే రాత్రిపూట 17 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పగటిపూట 30 డిగ్రీల సెల్సియస్, రాత్రిపూట 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చలి క్రమంగా తగ్గుతూ, వేడి పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు అంటున్నారు. అలాగే రాత్రిపూట మంచు బాగా కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా పండుగ కోసం ఊళ్లకు వెళ్లేవారికి ఇవాళ వాతావరణం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఇవీ చదవండి:
మరిన్ని ఏపీ, తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి