Home » Andhra Pradesh » Ananthapuram
సినీ గాయకుడు మహమ్మద్ రఫి జయంతిని పురస్కరించుకుని సాదియా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన గాన స్వరాంజలి వీక్షకులను ఎంతగానో అలరించింది. స్థానిక లలిత కళా పరిషత ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్ర మాన్ని పరిషత ప్రధాన కార్యదర్శి పద్మజ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగర శివారు కాలనీలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. మీ ఇంటికీ - మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం 22వ డివిజన పరిధిలోని మరువకొ మ్మ కాలనీలో టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించా రు.
స్థానిక అర్బన బ్యాంకులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయభవన అర్బనబ్యాంకులో మంగళవారం సెమీ క్రిస్మస్ వే డుకల్లో భాగంగా పాస్టర్ సురేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చైర్మన జేఎల్ మురళీధర్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ప్రజలకు చీకటి నుంచి వెలుగుపంచడమే తన జీవితపరమార్థమని యేసు పేర్కొన్నట్లు వివరించా రు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలో ఓ అధికారి తీరు మారలేదు, కమీషన్లలో తగ్గేదేలా అన్న తరహాలో వ్యవహరిస్తున్నారనే ఆ శాఖ వర్గాల నుంచే అభిప్రా యాలు వెలువుడుతున్నాయి. పత్రికల్లో వరుస కథనా లు వస్తున్నా, ఆ శాఖ రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారులు చివాట్లు పెట్టినా, కలెక్టర్ అవినీతిపై ఆరా తీస్తున్నా ఆయనలో ఇసుమంతైనా భయం కనిపించ కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పట్టణంలోని బీహెచ మహల్ థియేటర్ సమీపంలో సోమవారం మద్యం మత్తులో ఘర్షణపడిన సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడని పట్టణ పోలీసులు తెలిపారు.
పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండవ చదువుతున్న బీ పవిత్ర సౌతజోన ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య సోమవారం తెలిపారు.
చెరువు మట్టి విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్న వైసీపీ నాయకులను తరిమి కొడతామని టీడీపీ నాయకులు, రైతులు తెలిపారు. చెరువు మట్టిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సోమవారం రాయలచెరువులో టీడీపీ నాయకులు, రైతులు సమావేశం నిర్వహించి మాట్లాడారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులంతా సెల్ఫోనలో నిమగ్నమవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం స్థానిక 23వ డివిజనలోని ఫెర్రర్ నగర్లో కార్పొరేటర్ హరిత, టీడీపీ నా యకులు, అధికారులతో కలిసి పర్యటించారు.
విద్యార్థులు సెల్ఫోనలకు దూరంగా ఉండి, మంచి నడవడికతో ముందుకె ళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నా రు. కేక్కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంత రం పాఠశాలను పరిశీలించారు. ఇంటర్ వరకు తరగ తులు ఉండటంతో విద్యార్థులతో మాట్లాడారు.