Home » Andhra Pradesh » Chittoor
జిల్లా సహకారకేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ అధికారిగా నియమితులైన డీఆర్వో కె. మోహన్‌కుమార్ శనివారం మధ్యాహ్నం బ్యాంకుకు వచ్చారు.
తన బదిలీ కోసం రాజకీయ సిఫార్సు చేసిన ఓ కానిస్టేబుల్‌పై పోలీసు ఉన్నతాధికారి తీవ్రస్థాయిలో ఆగ్రహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల పదోన్నతికి ఆది, సోమవారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు.
చిత్తూరు డీఎంహెచ్‌వోగా సుధారాణిని నియమిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)గా దుర్గాప్రసాద్‌ను నియమించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.
చంద్రబాబు అక్రమ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పోరాడింది స్త్రీలే. వారి శక్తి అపారం. వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.’ అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ హాయంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆర్థికంగా సహాయ సాకారం అందిస్తున్నామని తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండో రోజు శుక్రవారం పర్యటన కొనసాగుతోంది. ఆమె బస చేసిన పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి అన్నారు.
సీఎం చంద్రబాబు ఆకాంక్షను నెరవేర్చే దిశగా తిరుమల ప్రక్షాళనకు పూనుకున్నారు టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు. పెనుమూరు మండలం దిగువపునేపల్లిలో పుట్టిపెరిగిన ఈయన తొలుత బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేశారు.
Telangana: ‘‘కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయి. ఆషామాషీగా వెళ్లి మీరందరూ చేసేదే నేను కూడా కాలేజ్‌లో చేసేదాన్ని. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీ హక్కుకోసం నడవాలి’’ అని నారా భువనేశ్వరి అన్నారు.