Share News

Bhuvaneshwari: ముందు నందమూరి కూతురు.. బాబు భార్య సెకండ్

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:14 PM

Telangana: ‘‘కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయి. ఆషామాషీగా వెళ్లి మీరందరూ చేసేదే నేను కూడా కాలేజ్‌లో చేసేదాన్ని. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీ హక్కుకోసం నడవాలి’’ అని నారా భువనేశ్వరి అన్నారు.

Bhuvaneshwari: ముందు నందమూరి కూతురు.. బాబు భార్య సెకండ్
Nara Bhuvaneshwari

చిత్తూరు, డిసెంబర్ 19: కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తోందన్నారు. ‘‘వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్ మోడల్ పెట్టుకోవాలి’’ అని విద్యార్థులకు సూచించారు. ప్రతి పురుషుని సక్సెస్ మహిళతోనే ముడి పడి ఉంటుందన్నారు. ‘‘కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయి. ఆషామాషీగా వెళ్లి మీరందరూ చేసేదే నేను కూడా కాలేజ్‌లో చేసేదాన్ని. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీ హక్కుకోసం నడవాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం సంపాదిస్తున్నారు. అది ఈజీ కాదు. హార్డ్ వర్క్. ఏదీ ఫ్రీగా రాదు. కష్టంతోనే వస్తుంది. బాలికలకు పట్టుదల, ధైర్యం, మీమీద నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేదాకా ఒకటి, తర్వాత మరొకటి. రాజకీయాల్లో బిజినెస్‌లో నన్ను నేను లాక్కుని ముందుకు వెళ్ళాను. మన ధైర్యం మనకుండాలి’’ అని వెల్లడించారు.

AP Fibernet: వ్యూహం సినిమాపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు



నాకేమీ తెలియదు.. అయినా

‘‘ముందు నందమూరి కుమార్తెను.. బాబు భార్య సెకండ్. ఒక మహిళగా నేనేమిటి అనేది నాకు తెలుసు. మనందరిలోనూ ఆ శక్తి ఉంది. ఫోకస్ పనిలోపెడితే ముందుకు వెళ్ళచ్చు. హౌస్ వైఫ్ ఉన్నప్పుడు హెరిటేజ్ చూసుకోమన్నారు. నాకే ఏమీ తెలియదు. ఎండీగా బాధ్యతలు ఇచ్చారు. అందరినీ ఒకటే అనుకున్నాను. జీవితాలు బాగుంటాయి. హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టాలి. నాన్నకంటే గొప్పవాడివి కావాలి. చేయకపోతే నీ ఫ్యూచర్ ఆగుతుంది అని నా కుమారునికి చెప్పా. మీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఎవరూ రారు. బద్ధకం ఉంటే జీవితంలో ఎడగలేరు. మీరే ఫ్యూచర్ లీడర్స్, ఏ రంగంలోనైనా. డిసిప్లిన్ ముఖ్యం. నాకు డిసిప్లిన్ ఎక్కువ. స్ట్రిక్ట్ నెస్ లేకపోతే నేను ముందుకు వెళ్లలేను. ఉద్యోగాలకు, ఆర్గనైజేషన్ టీమ్ వర్క్ ఉండాలి. అందరూ మనమే అంటేనే భవిష్యత్తు. సంతోషంగా కార్యక్రమం చేపట్టాలి. జీవితంలో టీచర్స్‌ను మరచిపోవద్దు. రెస్పెక్ట్ ఇవ్వాలి వారికి. అందరిలో ఉంటాయి తప్పులు. ఒక వేలు చూపిస్తే 4 వేళ్ళు మనల్ని చూపిస్తాయి. ఇవన్నీ ఎదుర్కొన్నాను నేను. వ్యాపారం, ఉద్యోగం అన్నింటిలోనూ ఆడపిల్ల దేనిలోనూ తక్కువకాదు. నా జీవితంలో చూస్తున్నాను. సోషల్ మీడియా, యూట్యూబ్ మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫోన్లు, సోషల్ మీడియా కుటుంబాలకు దూరం అవుతున్నారు’’ అని తెలిపారు.

సీఎం చెప్పినా వినరే.. ఏకంగా నదిలోనే..


అందుకే వచ్చా....

‘‘మా నాన్న నందమూరి తారకరామారావు పాలు అమ్మి వారి తల్లిదండ్రులకు హెల్ప్ చేసేవారు. అలానే చదువుకున్నారు. చంద్రబాబు కూడా కిలోమీటర్లు నడిచి, స్ట్రీట్‌ లైట్స్‌ కింద చదివేవారు. నా కొడుకు లోకేష్‌కు చెప్పాను, ఏదీ ఫ్రీగా రాదు అని. మొదట తల్లిదండ్రులు, గురువులు గౌరవించాలి. మిమ్మల్ని మొటివేట్ చేయాలని వచ్చాను. రాజకీయంగా కాదు. లోకేష్‌కు ఏది చెప్పానో అదే మీకు చెప్పాలని వచ్చాను. ఒక తల్లిగా వచ్చాను’’ విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు

వాహనదారులకు షాక్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 01:14 PM