Home » Andhra Pradesh » Elections
ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందువరకు కాన్ఫిడెంట్‌గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది..
ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్ పోల్స్‌ను విడుదలచేస్తాయి.
నిబంధనలు పాటించే కౌంటింగ్ ఏజెంట్లు తమకు వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు..
ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది..
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడ? పోలింగ్ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉంది.
జూన్ ఒకటి... దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను బహిరంగ పర్చడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.
ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections 2024) పోస్టల్ బ్యాలెట్ పత్రంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ ఓటు వేయకపోయినా, ఒకరికంటే ఎక్కువ మందికి ఓటేసినా అది చెల్లుబాటు కాదు...
మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.