Share News

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

ABN , Publish Date - May 29 , 2024 | 02:58 PM

ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?
Votes Counting

ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం (Election Commission) ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కౌంటింగ్ హాల్ లోపల ఈవీఎం(EVM)లు తెరవడం, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనేది ఎన్నికల సిబ్బంది లెక్కలు కడతారు. ఓవైపు ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల సంఘం తరపున విధులు నిర్వర్తిస్తే.. పోటీచేసిన అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునే హక్కు పోటీచేసిన ప్రతి అభ్యర్థికి ఉంటుంది. పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులంతా వారి తరపున ఏజెంట్లను నియమించుకోవచ్చు. సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకుంటారు. కౌంటింగ్ హాల్ బయట ఏజెంట్లు ఉంటారు. ప్రతి ఈవీఎంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనేది వరుసక్రమంలో చూపిస్తారు. ఏజెంట్లు వాటిని తమ వద్ద ఉన్న పేపర్‌పై నమోదు చేసుకుంటారు. ఇలా ఒక రౌండ్‌లో అన్ని టేబుల్స్‌పై వచ్చిన ఓట్లను కలిపి ఆ రౌండ్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. అలా అన్ని రౌండ్లలో వచ్చిన ఓట్లను గణించి ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు


కౌంటింగ్ ప్రక్రియ ఇలా..

కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒక నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూత్‌లు ఉన్నాయో లెక్కవేసి దానికి అనుగుణంగా లెక్కింపు టేబుళ్లను ఏర్పాటుచేస్తారు. ఏదైనా ఒక నియోజకవర్గంలో 200 పోలింగ్ బూత్‌లు ఉంటే.. కనీసం 10 నుంచి 14 టేబుళ్లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో టేబుల్‌కు సమానంగా పోలింగ్ బూత్‌లను కేటాయించి ఎన్ని రౌండ్లు లెక్కింపు చేపట్టాలనేది అధికారులు నిర్ణయిస్తారు. 200 పోలింగ్ బూత్‌లు ఉన్న నియోజకవర్గంలో 10 టేబుళ్లు ఏర్పాటు చేస్తే 20 రౌండ్లలో మొత్తం ఈవీఎంలను లెక్కించగలుగుతారు.

AP Elections 2024: షాకింగ్.. పోస్టల్ బ్యాలెట్‌ పత్రంపై ఇలా చేసుంటే ఆ ఓట్లు చెల్లవు!


ఏజెంట్ల అవసరం ఏమిటి..

ఓవైపు ప్రభుత్వ సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తారు. అదే సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు కీలక భూమిక పోషిస్తారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సిబ్బంది తెరుస్తారు. ఏదైనా ఈవీఎం బ్యాలెట్ బాక్స్ (కంట్రోలర్ యూనిట్) సిబ్బంది తెరవడానికి ముందే ఓపెన్ చేసినట్లు అనుమానం వస్తే కౌంటింగ్ సిబ్బంది అభ్యంతరం చెప్పొచ్చు. అప్పుడు ఉన్నతాధికారులు ఆ విషయంపై విచారణ చేసి అసలు విషయం కనుగొనే ప్రయత్నం చేస్తారు. ముందుగానే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినట్లు రుజువైతే ఆ బాక్స్‌లో ఓట్లను లెక్కించరు. మిగిలిన ఈవీఎం బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను లెక్కించిన తర్వాత మెజార్టీ పెండింగ్‌లో పెట్టిన ఈవీఎంలో ఓట్ల కంటే ఎక్కువుగా ఉంటే ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మెజార్టీ పెండింగ్ ఈవీఎంలో కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రతి రౌండ్‌లో వచ్చిన ఓట్లను కౌంటింగ్ ఏజెంట్లు నమోదు చేసుకుంటారు.

Chandrababu: ఏపీ ఫలితాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదే..


ఎంతమంది ఏజెంట్లను అనమతిస్తారు..

ఒక నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ హాల్‌ను కేటాయిస్తారు. ఆ హాల్‌లో ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయిస్తారో.. ఒక్కో అభ్యర్థి తరపున అంతమంది ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 12 టేబుళ్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయిస్తే ఒక అభ్యర్థి 12 మంది ఏజెంట్లను నియమించుకోచ్చు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగడంలో ఏజెంట్లు కీలకంగా పాత్ర పోషిస్తారు.


ఏపీలో పెన్షన్ల టెన్షన్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 02:59 PM