AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!
ABN , Publish Date - May 30 , 2024 | 03:04 PM
ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందువరకు కాన్ఫిడెంట్‌గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట.
ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందువరకు కాన్ఫిడెంట్‌గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారట. పోలింగ్ ముగిసిన తర్వాత.. ఓటింగ్ సరళిని గమనిస్తే ఓటర్లలో ఎక్కువమంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే ప్రచారం బాగా జరిగింది. దీంతో ఫలితాలు తమకు ప్రతికూలంగా వస్తాయనే టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అధికారం తమదేనంటూ విశ్వాసం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ప్రస్తుతం ఓటమి తప్పేలా లేదని అంచనాలు వేసుకుంటున్నారట. ఫలితాల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతల్లో ఆందోళన పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు నేతలైతే ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
కాన్ఫిడెన్స్ తగ్గిందా..
నోరు తెరిస్తే చాలు 175 స్థానాల్లో గెలుస్తామంటూ వైసీపీ నేతలు ధీమాగా చెప్పేవారు. అది సాధ్యం కాదని తెలిసినా 175 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేస్తామంటూ వైసీపీ అధినేత జగన్ పదేపదే ప్రకటించుకోవడమే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్‌గా మారిందనే ప్రచారం జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఎంతో కీలకం. ప్రజల పక్షాన పోరాడేందుకు ప్రతిపక్షం అవసరం. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం అన్ని నియోజకవర్గాల్లో తానే ఉండాలని.. తద్వారా ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించాలనే ఓ దురాలోచనతోనే ఆ ప్రకటన చేశారనే విమర్శలు, ఆరోపణలు లేకపోలేదు. ప్రతిపక్షం ఉండకూడదని కోరుకునే జగన్‌కు ఈసారి ప్రజలు గట్టిగానే గుణపాఠం చెప్పబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
విదేశాలకు ప్లాన్
అధికారం ఉందనే అహంకారంతో ప్రజాప్రతినిధులుగా కాకుండా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అరాచకంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజావ్యతిరేక విధానాలతో పనిచేసిన నాయకులు ప్రస్తుతం ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఓడిపోతే విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నెల్లూరు ఎమ్మెల్యే అనీల్ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలు విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలియాలంటే జూన్4వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read more Andhra Pradesh and Telugu News