Home » Andhra Pradesh » Elections
పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలన్నీ ప్రాణాంతకమైనవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్‌పైనే నెలకొంది. జూన్4 కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
పల్నాడు ఎస్పీ బింధుమాదవ్, తమ కుటుంబాలకు చుట్టరికం ఉందని చెబుతూ సాక్షిపత్రిక, మీడియా అసత్య కథనాలు రాస్తుందని నర్సారావు పేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. తన వైపు నుంచి ఏ సమాచారం కావాలన్న ఇస్తామని అన్ని విధాలా అధికారులకు సహకరిస్తానని చెప్పారు.
సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ (మే -13) ముగిసిన తర్వాత జరిగిన అలర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు.
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సోమవారం ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో పోలింగ్ రోజు(ఈ నెల 13న).. (AP Elections) ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అల్లర్లను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం (Election Commission) పలువురిపై చర్యలు తీసుకుంది. ఈ విషయంపై మాజీ ఐఎఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ (Vijay Kumar) స్పందించారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై (MLA Rachamallu Sivaprasad Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.